గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ దూకుడు..!
గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అన్ని చోట్ల బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం వెలువడిన లెక్కల ప్రకారం.. 1636 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉండగా.. కాంగ్రెస్ 625 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఆప్ 16 స్థానాల్లో ఉంది. మొత్తం 231 తాలూకా పంచాయతీల్లోని 4,772 స్థానాల్లో స్వతంత్రులు 51 చోట్ల ఆధిక్యంలో ఉండగా బీఎస్పీ 5చోట్ల ఉంది. 31 జిల్లా పంచాయితీల్లోని 980 సీట్లలో బీజేపీ 382 స్థానాల్లో, కాంగ్రెస్ 84 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. బీఎస్పీ, స్వతంత్రులు, ఇతర పార్టీకి చెందిన ఒకరు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక మునిసిపాలటీల్లో బీజేపీ 1,182 స్థానల్లో లీడ్లో ఉండగా.. హస్తం పార్టీ 214 చోట్ల లీడ్లో ఉంది. స్వతంత్రులు 73 చోట్ల లీడ్లో ఉండగా.. ఆప్ 2, బీఎస్పీ 2, ఇతరులు 10 స్థానాల్లో లీడ్లో ఉన్నారు.