హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవతల చిత్రాల్ని ముద్రించిన లోదుస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సహారా రే వెనక్కి తగ్గింది. హిందూ సమాజం నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో తన బ్రాండ్ ‘సహారా రే స్విమ్’ ను వెబ్ సైట్ నుంచి తొలగించింది.
ఈ బ్రాండ్ తయారు చేసిన స్విమ్ వేర్ ‘ఆరా కలెక్షన్ 2022’లో ఒక భాగం. ఈ బ్రాండ్ ఎక్కువగా థాంగ్ జీన్స్, మైక్రో స్ట్రింగ్ టాప్స్‌ను తయారు చేస్తుంది. ఇటీవల నూతనంగా రూపొందించిన స్విమ్ వేర్ పైన హిందూ దేవతల చిత్రాలను ప్రింట్ చేసింది. దీనిపై సోషల్‌మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. దీంతో 24 గంటల్లో సహారా రే స్విమ్ కలెక్షన్స్ ను తొలగొంచింది.
క్షమించండి…ఈ కలెక్షన్స్ లో ప్రొడక్ట్స్ ఏవీ లేవు అని దుస్తుల బ్రాండ్ వెబ్ సైట్లో పొందుపరిచింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ‘సహారా రే స్విమ్’ అధికారిక పేజీలో బ్రాండ్ తన కాంటాక్ట్ సమాచారాన్ని పూర్తిగా తొలగించింది. అయితే కనీసం క్షమాపణ చెప్పలేదు.
ప్రముఖ ట్విట్టర్ వినియోగదారు మధుర్ సింగ్ ‘సహారా రే స్విమ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అభ్యంతరకరమైన స్విమ్‌వేర్ కలెక్షన్స్ ను ప్రశ్నించిన వినియోగదారులను మొదట బ్లాక్ చేసిందని తెలియజేశారు.
తర్వాత కామెంట్ల ఆప్షన్ ను ఆఫ్ చేసి, అదే లోదుస్తుల ఫోటోల సెట్‌ను మళ్ళీ పోస్ట్ చేసారని మండిపడ్డారు. దీనిపై హిందూ ఐటీ సెల్ స్పందించింది. హిందువుల విశ్వాసాలకు వ్యతిరేకంగా సంస్థ ప్రవర్తించిందని…ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని…చట్టబద్దంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)