పాస్టర్ ప్రవీణ్ మరణంలో కొత్త విషయాలు….
తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ మరణం సంచలనం గా మారింది. ఆయన్ని హిందూ మత శక్తులు మర్డర్ చేశాయంటూ క్రైస్తవ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కుహానా మేధావులు, సెక్యులరిస్టులు కూడా ఇదే వాదన్ని వ్యాప్తి చేస్తున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం వెనుక వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
….
హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్.. కోదాడలోని మద్యం దుకాణంలో రూ.650తో మద్యం సీసా కొనుగోలు చేసి, ఫోన్‌పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల-పరిటాల మధ్య అదుపుతప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యా యి. అక్కడినుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్‌లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. పెట్రోల్ బంక్ లో 872 రూపాయలు ఫోన్ పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్‌లైడ్ ఊడిపోయి ఉంది.
…
ఆ తర్వాత ఏలూరు లో మరోసారి మద్యం కొనుక్కొన్నట్లు ఫోన్ పే రికార్డులలో లభ్యం అయింది. దీంతో ప్రయాణంలో రెండు సార్లు మద్యం బాటిల్స్ కొనుక్కొని పీకల దాకా తాగినట్లు తెలుస్తోంది. రెండు సార్లు బులెట్ మీద నుంచి జారిపోయిన అపస్మారక స్థితిలో బైక్ నడుపుతూ ముందుకు సాగాడు. దీనిని బట్టి రాజమండ్రి సమీపంలో రోడ్ యాక్సిడెంట్ కు గురై చనిపోయినట్లుగా అర్థం అవుతోంది. అయినప్పటికీ క్రైస్తవ సంఘాలు ఉద్దేశ పూర్వకంగానే దీని మీద రాద్ధాంతం చేస్తున్నాయి.
…
మరో వైపు,, ఆంధ్రప్రదేశ్ లో ఈ పాస్టర్ మరణం అడ్డుపెట్టుకొని కొన్ని సంఘాలు వివాదాస్పదం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం తో బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ లో అదే సమయంలో ఇద్దరు పాస్టర్ లు ఇదే తరహాలో చనిపోయారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అంతా గప్ చుప్ చేసేశారు. దీనిని బట్టి ఈ వివాదం వెనుక బీజేపీ ని బద్నామ్ చేసే కుట్ర దాగి ఉందన్న విషయం అర్థం అవుతోంది.
Blaming & rubbing everything towards politics is ysrcp nature
– Clearly shows Praveen pagadala purchasing liquor
– being pastor he was concerned about his image to hide face while purchasing liquor
– he met an accident & lost his own life just only because of his ignorance
-… https://t.co/oYG7CD62C5 pic.twitter.com/RHwxwKBaMG— Harsha (@CBNArchives) March 30, 2025