అసలు ఈ హిజాబ్ గొడవ వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ వివరాల్లోకి వేళ్తే… ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ తెరతీశారు. తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా నాన్-ఇస్లామిక్ దేశాల్లో ప్రారంభించారు ఆ మహిళా డాక్టర్.
ఈ హిజబ్ లేదా తల మీద కప్పుకునే వస్త్రం/ ఒళ్ళంతా కప్పుకునే బుర్ఖా వేసుకోవడం అనేది నాన్ ముస్లిం మహిళలకు పరిచయం చేయడం..నాన్ ముస్లిం మహిళల చేత కనీసం ఒక్కరోజన్నా హిజబ్/బుర్ఖా ను ధరింపచేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం..ఉడిపి, మణిపాల్.. లాంటి కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈ హిజబ్/బుర్కా ద్వారా హిందూ మహిళలకు దగ్గర కావడానికి జమాతే ఇస్లాం , PFI, దాని అనుబంధ SDPI ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాయి.అందులో భాగంగానే గతేడాది ఫిబ్రవరి 1 న ఉడుపి ..మణిపాల్ లాంటి చోట్ల హిజబ్ డే నిర్వహించారు..చాలామంది హిందూ బాలికలు హిజబ్/బుర్ఖా దరించడానికి తిరస్కరించారు..