బిక్షగాడు హీరో విజయ్ ఆంటో ని తిరుపతిలో సందడి చేశాడు.బిక్షగాడు-2 సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన విజయ్ బిక్షగాళ్లకు కిట్లు పంపిణీ చేశాడు.
సినిమా విజయం సాధించిన సందర్భంగా విజయ్ ఆంటోని పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే చిత్ర యూనిట్ తిరుపతి వచ్చింది.. కపిలతీర్ధం వద్ద ఉన్న బిక్షగాళ్ళకు దుప్పటి, ఆహారం పంపిణి చేసి… కొంత సేపు. వారితోనే ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.బిక్షగాడు-2 సినిమాను ఆదిరించిన తెలుగు ప్రేక్షకులందరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.. బిక్షగాడు-2 సినిమాను విజయం సాధించిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు..బిక్షగాడు-3 సినిమాకు కథ రాస్తున్నానని, 2025లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు.