భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకోసం తన పదవిని త్యాగం చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ మిమన్ బందోపాద్యాయకు సమర్పించారు. మమత అక్కడినుంచే పోటీ చేసి గెలుస్తారని రాజీనామా అనంతరం శోభన్ దేవ్ తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అత్యధికస్థానాల్లో గెలిచినా మమతాబెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ఆమె పార్టీ అధికారాన్ని హస్తగతం గెలుచుకున్నా మమత మాత్రం నందిగ్రామ్ నుంచి ఓటమిపాలయ్యారు. ఆరునెలల్లోగా తిరిగి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉంది. దీంతో శోభన్ దేవ్ ఆమెకోసం తన పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ రెండు పర్యాయాలు విజయం సాధించారు.