అయోధ్య లో ధ్వజారోహణ ఆధ్యాత్మిక వాతావరణం లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా భారతీయులంతా దీనిని ఆస్వాదించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం యావత్తు భారతావని కోరిక. ఇందుకు అనుగుణంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతమైన క్షేత్రం కొలువుతీరింది.
…………
ఇంతటి అద్భుత ఘట్టాన్ని చూసి పొరుగు దేశం పాకిస్తాన్ కడుపు మంటతో రగిలిపోతోంది. దీనిపై నోటికొచ్చినట్టు మాట్లాడింది పాకిస్తాన్. మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణించింది. బాబ్రీ మసీదును కూల్చి రామమందిరాన్ని కట్టారని అంది. మైనారిటీల సాంస్కృతిక ,మత వారసత్వాన్ని క్షీణింపజేయడానికి ఉద్దేశ పూర్వక ప్రయత్నాలని విమర్శించింది. భారతీయ ముస్లింలను అణిచివేసే చర్యగా పేర్కొంది.
……….
ఈ పిచ్చి కూతలను భారత్ బలంగా తిప్పికొట్టింది. మైనార్టీల అణచివేసి, మతతత్వ రికార్డులు కలిగిన దేశానికి ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడదని నిలదీసింది. ఎదుటి వాళ్ళ గురించి వేలెత్తి చూపెట్ట ముందు వారి ఇంటిని చక్కబెట్టుకోవాలని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చురకలు అంటించారు. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం అర్హమైనవి కావని ఆయన అన్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మతతత్వం, మైనారిటీలపై అణచివేత వంటి ట్రాక్ రికార్డు ఉన్న పాక్ కు ఇతరులకు నీతులు చెప్పే అర్హత లేదని దుయ్యబట్టారు. పాకిస్తాన్ బండారం బట్టబయలు చేసేశారు.
……………



