పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. భగవంత్ కు మోదీ అభినందనలు తెలిపారు. . రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి కేంద్రం కృషి చేస్తుందని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు భగవంత్ మాన్ గారూ. పంజాబ్ అభివృద్ధి కోసం, పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం మనం కలిసి మెలిసి కృషి చేద్దాం’’అంటూ ట్వీట్ చేశారు ప్రధాని. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీశ్ శిశోడియా, ఇతర నేతలు భగవంత్ మాన్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)