మోదీ పర్యటన సందర్భంగా ప్రవాసభారతీయులు అక్కడ భగవాను ప్రదర్శిస్తే ఇక్కడ సెక్యులర్ కాంగ్రెస్ వాదులకు మండినట్టుంది. ఆ పార్టీ స్పోక్ పర్సన్ అదేం జెండా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/drshamamohd/status/1521134704459583489?s=20&t=n0uLGJg-PQ5DZ-fn4l8gfQ
యూరప్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి సోమవారం జర్మనీలో ప్రవాస భారతీయుల నుంచి అపూర్వస్వాగతం దక్కింది. బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద మోదీకి స్వాగతం పలుకుతూ మువ్వన్నెల జెండాతో పాటు కాషాయధ్వజాన్నీ ప్రదర్శించారు.
అందుకు సంబంధించిన వీడియోను పీఎంవో విడుదల చేసింది. అందులో భారతీయ ప్రవాసులు కాషాయపు జెండాను ఊపుతూ సాంప్రదాయ మహారాష్ట్ర నృత్య ప్రదర్శన చేస్తున్నారు. ఆ భగవా బంగారు జరిపట్టా కలిగి ఉంది. మరాఠావీరుడు శివాజీ…. మొఘల్, ఇస్లామిక్ సుల్తానులను ఎదుర్కొంటూ హైందవి స్వరాజ్య నినాదాన్ని చాటుతూ కాషాయధ్వజాన్ని రెపరెపలాడించాడు.
అయితే మోదీ పర్యటన సందర్భంగా..
జర్మనీలో కాషాయ జెండా రెపరెపలాడుతుండటం చూసి కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది.కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్ ట్విట్టర్ లో “ఎవరిది ఈ జెండా?” అని ప్రశ్నించారు. విదేశీ నిధులతో కూడిన శక్తులు అంతర్జాతీయ వేదికలపై హిందూరాష్ట్రంలో ముస్లింలు దాడికి గురవుతున్నారనే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, డాక్టర్ మొహమ్మద్ ప్రచారకులను తన ప్రశ్న ద్వారా రెచ్చగొట్టాలని చూశారు. అయితే ఆమె భారతదేశ గర్వించదగిన చరిత్రను, ధైర్యవంతులైన యోధుల గురించి తనకున్న మిడిమిడి అవగాహనను తానంతట తానే బహిర్గతం చేసుకుంది.