మొగల్ రాజు ఔరంగజేబు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు, హైందవ రాజులు, వర్తకులు, వివిధ రకాల ప్రజల్ని రక రకాలుగా హింసించాడు. ఆఖరికి జుట్టు పెంచుకొన్నా, బొట్టు పెట్టుకొన్నా పన్నులు వేసి చిత్ర వధ చేసేశాడు. ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పిడులు చేయించి, భారత్ లో విస్తారంగా ముస్లిం జనాభా పెంచేందుకు తాపత్రయ పడ్డాడు. కాదన్న వారి చర్మం ఒలిపించటం, కళ్లు పీకేయటం వంటి దారుణమైన శిక్షలు అమలు చేశాడు.
….
ఇదంతా ఒక ఎత్తయితే, దేవాలయాలను వెదకి వెదకి మరీ ధ్వంసం చేయించాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని అత్యంత నీచ ప్రవ్రత్తితో ధ్వంసం చేయించాడు. అక్కడ జ్నానవాపి పేరుతో మసీదు ఏర్పాటు చేయించాడు. అలాగే శ్రీ కృష్ణుని జన్మస్థలమైన మధుర మీద దండెత్తి అక్కడ బాల క్రిష్ణుని ఆలయాన్ని నాశనం చేసేశాడు. అక్కడ షాహి ఈద్గా పేరుతో మసీదుని కట్టించేశాడు. ఇలా ఒకటేమిటి, అనేక ప్రఖ్యాత దేవాలయాలను వెదకి వెదకి మరీ ధ్వంసం చేశాడు.
….
అదే దూకుడు లో మన తెలంగాణ లోని భద్రాచలం ఆలయాన్ని వెదక్కొంటూ వచ్చేశాడు. ప్రమాదాన్నిపసిగట్టి అంతా తలో మూలకు పారిపోయారు. ఆ సమయంలో అక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్న కాకుళ్ల రామానుజాచార్యులు చాలా ధైర్యంతో తెలివిగా వ్యవహరించారు. భద్రాచలం ప్రధాన ఆలయంలో మూలవిరాట్ బయటకు కనిపించకుండా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక గోడ కట్టించేసారు. అక్కడ తాత్కాలికమైన బొమ్మలను ఏర్పాటు చేయించి అవే అసలు విగ్రహాలు అన్నట్లుగా భ్రమింపచేశారు. దీంతో వాటిని కొట్టేసి మొగల్ సేన ముందుకు వెళ్లిపోయారు.
…
అలాగే, ఉత్సవ మూర్తులు, పరివార దేవతలను దాచేసేందుకు అర్చక స్వామి మరో ఎత్తుగడ ఉపయోగించారు. ఆయా విగ్రహాలను ఒక పెట్టెలో పెట్టి, గోదావరినదిలో ఒకచోట భద్రపరిచి, అక్కడ ఒక రహస్యగుర్తు ఏర్పాటు చేసుకున్నారు. దండయాత్ర అయిపోయాక, గోదావరిలో ఉన్న, ఉత్సవ విగ్రహాలను బయటకు తీయించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆ హడావుడిలో సీతమ్మ కనపడలేదు. ఈ లోగా శ్రీరామ నవమి ముంచుకొచ్చింది. దీంతో సీతమ్మ లేకుండా కళ్యాణం ఎలా చేయాలని ఆలోచించి, ఇక ఆ ఆప్షన్ లేదు కనుక, మూలమూర్తులకు కళ్యాణం చేసారు. ఆ తర్వాత విరివిగా వెదకిస్తే, సీతమ్మ తల్లి ఉత్సవ విగ్రహం కూడా కనిపించింది.
..
అప్పటి నుంచి భద్రాచలంలో శ్రీ రామ నవమి రెండు రకాలుగా కళ్యాణం నిర్వహిస్తారు. అటు ఉత్సవ మూర్తులకు, ఇటు మూలవరులకు కూడా కళ్యాణం చేయిస్తారు. ఔరంగజేబ్ నుంచి కాపాడుకొనేందుకు శ్రీరాముడే అర్చక స్వామి రూపంలో ఈ రక్షణ చేసుకొన్నాడని చెప్పుకోవచ్చు. ఇంతటి దుర్మార్గాలకు పాల్పడిన ఔరంగజేబ్ ను కొంత మంది కుహానా సెక్యులర్ వాదులు భజనలు చేయటం మరీ విడ్డూరం .