రామాయణ యాత్రలో భద్రాచలంకు చోటు దక్కింది.
దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే “శ్రీ రామాయణ యాత్రను” చేపడుతోంది. “దేఖో అప్నా దేశ్”( చూడండి మన దేశాన్ని) అంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని భారతీయ రైల్వే తన ప్రధాన విభాగం IRCTC ద్వారా ఈ ప్రత్యేక పర్యాటక రైలును నడుపుతోంది.
17 రోజుల పాటు సాగే ఈ రైలు యాత్రలో శ్రీ రాముడికి జీవితానికి సంబంధించిన ప్రధాన ప్రదేశాలైన అయోధ్య, నందిగ్రామ్, జనక్‌పూర్, సీతామర్హి, వారణాసి, సీతా సమాహిత్ స్థల్, ప్రయాగ, శృంగవేర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం ధనుష్కోడి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఈ జాబితాలోకి చేర్చారు.