ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి మెరుగుపడింది. 2014తో పోల్చితే గత ఏడాది తిరుగుబాటు ఘటనలు 74 శాతం తగ్గడంతో ఆయా రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 2021లో పౌర మరణాలలో 89 శాతం.. భద్రతా దళాల మరణాలలో 60 శాతం తగ్గుదల కనిపించింది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో చర్చల సందర్భంగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014 నుంచి గత నెల 15వ తేదీ వరకు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ తిరుగుబాటు గ్రూపులకు చెందిన ఆరు వేల మంది కేడర్లు లొంగిపోయారని మంత్రి తెలిపారు.