అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ వి కాకుండా పోవని భారత్ సైతం ధీటుగానే స్పందిస్తూ చైనా చర్యను ఖండించింది.
ఇదిలా ఉంటే చైనా తీరుపై భారతీయ నెటిజన్లు సైతం స్పందిస్తూ ఆటాడుకుంటున్నారు. భారత్ లోని ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకుంటే..చైనా రాజధాని సహా పలు ప్రాంతాలకు పేర్లు పెట్టారు. కమ్యూనిస్టు దేశమైన చైనా నగరాలకు చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టారు. హర్ ప్రీత్ అనే ట్విట్టర్ వినియోగదారు ఒకరు చైనా చర్యను ఖండిస్తూ…బీజింగ్ ను ‘భుజంగ నగర్’ గా మార్చారు. టిబెట్ రాజధాని లాహ్సాను ‘లక్ష్మణ్ ఘర్’ గా గ్వాంగ్ జౌను ‘ఘంటా ఘర్’ గా మార్చేసింది హర్ ప్రీత్ . దాంతో వరుసగా నెటిజన్లు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘై కి ‘శంభునగర్’గా, జిన్జియాంగ్ ప్రాంతం ‘శివగంగా నగర్’గా మారిపోయింది.
దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటానికి కేంద్రంగా నిలిచిన తియన్మార్ స్క్వేర్ పేరును ‘ట్యాంక్ చౌక్’ గా పేరు మార్చారు.
చైనాలోని ప్రదేశాలకే కాదు ప్రధానమంత్రి జిన్ పింగ్ పేరు కూడా మార్చారు. ఆయనకు శ్రీ జటాశంకర్ అనే కొత్త పేరు వచ్చింది. ఊహించినట్లుగానే, వుహాన్ పేరు ..కోవిడ్పూర్, మైక్రోబ్ ప్రావిన్స్, వైరస్-పూర్ వంటి పేర్లు పెడుతూ వైరల్ చేశారు.
అసలే దేశంలో పలు ప్రాంతాలకు పాతపేర్లు మార్చాలనే ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అందులో ముందున్నారు. చైనా తీరుపై అయితే నెటిజన్ల సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశం నుంచే మొదలైన కోవిడ్ వైరస్, చైనీస్ వంటకాల గురించి కూడా నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్ , కార్టూన్లు వేస్తున్నారు.
Guangzhou: घंटा घर
Tiananmen Square: Tank चौक
— Harpreet (@CestMoiz) December 31, 2021
Some more options!
Shanghai- ShaniGarh
Panyu- Punya nagar
Harbin- Haripur
Chongquing- Chandrakund
Dongguan- Dronagiri
Guangzhao- Ganpatipuram(Courtesy: @FraudryTrashcan)
— Harpreet (@CestMoiz) December 31, 2021
On one of my WA groups, folks have done some renaming of their own:
Beijing : भुजंग नगर
Lhasa : लक्ष्मणगढ़
Tibet : तिवतियानगर— Harpreet (@CestMoiz) December 31, 2021