మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అవుతోంది. ఈ వ్యవహారం కేరళ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ నిన్న ట్వీట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని తనయుడు, పార్టీయువనేత అనిల్ ఆంటోనీ ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ట్వీట్టర్లో షేర్ చేశారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా… అనిల్ ఆంటోనీ వ్యతిరేకించారు. బీబీసీ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కినట్టేనని ఆంటోని వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయంతో తీవ్రంగా విబేధిస్తూ అన్ని పదవులకు రాజీనామా చేశారు.