బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా పొరపాటున తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది. ఇప్పుడిక రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.కట్టాల్సినవాటికి తోడు జరిమానా, వడ్డీని కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో సోదాలుచేసిన సంగతి తెలిసిందే.
బ్రిటిష్ ప్రభుత్వ నిధులతో పని చేస్తున్న బీబీసీ ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఈ-మెయిల్‌ను పంపినట్లు తెలిసింది పన్ను రిటర్నులలో ఆదాయం రూ.40 కోట్లు తక్కువగా చూపినట్లు అంగీకరించింది.
ఇక ఇప్పుడు బీబీసీ పన్ను ఎగవేతకు సంబంధించిన విధివిధానాలను పాటించవలసి ఉంది. చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.