China Deploys Digital Camouflage Tanks Along LAC. చైనా మన సరిహద్దుల వెంబడి డిజిటల్ కామోఫ్లాజ్ లైట్ మెయిన్ బాటిల్ కాంబాట్ టాంక్స్ ని మోహరిస్తున్నది !
ఇలా ప్రతి విషయం పోస్ట్ పెట్టడానికి కారణం ఏమిటంటే సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు ఒక్క సారిగా పూర్తి స్థాయి యుద్ధానికో లేదా ఘర్షణ కొ దిగినప్పుడు .. అదే సమయంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి .. చూశారా బిజేపి కావాలనే ఎన్నికలప్పుడు చైనాతో ఘర్షణకి దిగి దానిని ఎన్నికల లబ్ధి కోసం వాడుకుంటున్నది ఆని మీడియా తో పాటు ప్రతి పక్షాలు ,అలాగే సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరగకుండా ముందస్తుగా సామాచారం కోసమే !
something fishy! తూర్పు లడాక్ వద్ద తన వైపు చైనా తేలికపాటి యుద్ధ టాంకులని మోహరిస్తున్నట్లు గత వారం తెలియచేశాను అలాగే మన దగ్గర తేలికపాటి యుద్ధ టాంకులు లేవు అందుకని దిగుమతి చేసుకోవడానికి వీలుగా రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పేరుతో టెండర్లు పిలిచింది భారత ఆర్మీ అని.
అయితే ఇప్పుడు చైనా కేవలం విన్యాసాల కోసమే కాకుండా చాలా సీరియస్ గానే తీసుకుంటున్నది. అందుకే కేవలం మాక్ డ్రిల్ కోసమే అయితే తన యుద్ధ టాంకులకి డిజిటల్ కామోఫ్లాజ్ పెయింటింగ్ వేయదు.
డిజిటల్ కామోఫ్లాజ్ పెయింటింగ్ ఎందుకు ? తమ సైనికులు చేసే విన్యాసాలని భారత సైనిక నిఘా వర్గాలు శక్తివంతమయిన బైనాక్యులర్స్ తో చూడగలరు అలాగే సైనిక గూఢచార ఉపగ్రహాలు ఫోటో లు తీయగలవు. అయితే డిజిటల్ కామోఫ్లాజ్ పేయింట్ కనుక వేస్తే అవి ఆక్కడి పరిసరాలలో చాలా ఖచ్చితంగా కలిసిపోయి దూరం నుండి బైనాక్యులర్స్ తో చూసినా కనపడవు. మరీ ముఖ్యంగా రాత్రి పూట అయితే అసలు కనపడవు even నైట్ విజన్ బైనాక్యులర్స్ వాడినా కనుక్కువడం కష్టం. అదే సమయంలో ఉపగ్రహాలు తీసే ఫోటోలతో వీటిని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే పై నుండి చూస్తే అవి అక్కడి పరిసరాలతో కలిసిపోయి గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తాయి …. డిజిటల్ ఎందుకు ? డిజిటల్ డిజైన్ వలన ఉపయోగం ఏమిటంటే అసలు పెయింట్ లేకుండా పరిసరాలతో ముందు ఒక డిజిటల్ ఫోటో తీస్తారు తరువాత దానిని కామోఫ్లాజ్ సాఫ్ట్వేర్ ద్వారా డిజైన్ చేసిన పెయింట్ ని వేస్తుంది కంప్యూటర్ . ఆ డిజైన్ ని ముందు ప్రయోగాత్మకంగా టాంక్ కి వేసి దూరం నుండి వాళ్ళే బైనాక్యులర్స్ తో చూస్తారు దాంతో ఏ డిజైన్ బాగా పనిచేస్తున్నదో .. అంటే దూరం నుండి చూసినా కనపడక పోవడం .. రాత్రి పూట అసలు కనపడకపోవడం [నైట్ విజన్ బైనాక్యులర్స్ తో చూసినా సరే ] దానిని సెలెక్ట్ చేసి ఫైనల్గా ఇంకో సారి ట్రయల్స్ వేసి ఆ తరువాత ఆ డిజైన్ నె టాంకులకి వేస్తారు.
ఇంత ప్రయాస ఎందుకు ? Well! చైనా చాలా సీరియస్ గానే తీసుకుంటున్నది అన్నమాట. ఏదో అక్కడి పరిసరాలు అలవాటు కావడం కోసమే కాదు నిజంగా యుద్ధం లేదా ఘర్షణ వాతావరణం వస్తుంది అనే ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తున్నది చైనా అని ఇలాంటి విషయాల మీద ఎప్పుడూ నిఘా వేసే నిపుణులు అంటున్నారు.
చైనా తన భూభాగాన్ని 5 విభాగాలుగా విభజించింది. ఒక్కో విభాగానికి థియేటర్ అని పేరుపెట్టింది. పశ్చిమ భాగాన్ని వెస్ట్రన్ థియేటర్ అని అలాగే మధ్యలో ఉన్న దానిని సెంట్రల్ థియేటర్ అని, తూర్పున ఉన్న దానిని ఈస్ట్రన్ థియేటర్ అని పిలుస్తుంది. అయితే ఇప్పుడు చేస్తున్న డ్రిల్ మాత్రం ఆన్ని థియేటర్ లనుండి తమ సైనికులని భారత సరిహద్దులలో కి తరలించి ఒక బాచ్ తరువాత ఇంకో బాచ్ లకి అక్కడ డ్రిల్ చేయిస్తున్నది.
ఒక వేళ యుద్ధం అంటూ వస్తే తనకి పశ్చిమ థియేటర్ అయిన మన సరిహద్దుల వద్ద దెబ్బతింటే వెంటనే ఇంకో థియేటర్ కమాండ్ నుండి సైనికులని లాడాక్ దగ్గరికి తరలించడానికి వీలుగా ముందస్తు విన్యాసాలు చేస్తున్నది చైనా. అంటే ఆ ప్రదేశం ఎవరికీ కొత్త కాకుండా అలవాటు చేయడానికి ఇదంతా చేస్తున్నది.
1. ఆర్మీ , ఎయిర్ఫోర్స్ లతో సహా ఆర్టీలరీ దళాలకి కూడా ముందస్తు శిక్షణ ఇస్తున్నది. మరో విషయం ఏమిటంటే శక్తివంతమయిన మల్టీ బారెల్ రాకెట్ లాంచర్స్ ని మోహరించింది అలాగే రోజూ వాటిలో నిజమయిన రాకెట్స్ ని పెట్టి అవి ఆ ప్రదేశలో ఎలా పనిచేస్తున్నాయో పరీక్షిస్తున్నది. ఇదంతా యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకొని ముందస్తుగా శిక్షణ ఇస్తున్నది.
2. యుద్ధం చైనా నె మొదలుపెట్టవచ్చు ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ ఇక ఉండబోదు ఎందుకంటే వచ్చే రెండు నెలలలో దాదాపుగా 60% వాక్సినేషన్ పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది భారత ప్రభుత్వం. ఆగస్ట్ నుండి రోజుకి 1 కోటి వాక్సిన్లు వేయాలని టార్గెట్ పెట్టుకుంది కాబట్టి మూడో వేవ్ అనేది కాంగ్రెస్ రాష్ట ప్రభుత్వాల పుకారు మాత్రమే. నమ్మవద్దు.
3. యుద్ధం కంటే దానికి సన్నాహాలు చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కానీ చైనా ఎంత ఖర్చు అయినా వెనకాడడం లేదు. వేల కొద్దీ సైన్యాన్ని రొటేషన్ పద్ధతిలో ఒక చోట నుండి ఇంకో చోటకి తరలించి శిక్షణ ఇస్తున్నది. భారత్ ఏదో చేయబోతున్నది అని చైనా నిఘా వర్గాల హెచ్చరిక కూడా ఒక కారణం కావొచ్చు.
4. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో సైన్యానికి స్వేచ్చ ఇవ్వలేదు. ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా ఢిల్లీ అనుమతి తీసుకోవాలి కానీ ప్రస్తుతం అలాంటి అవసరం లేదు. అవసరం అయితే వెంటనే ప్రతిస్పందించే అధికారం ప్రస్తుతం మన సైనిక కమాండర్ల చేతిలో ఉంది .. ఇదే చైనా భయాలకి కారణం.
5. గత 60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్సాయ్ చిన్ ,తూర్పు లాడాక్ వద్ద శ్వాస్వత కట్టడాలని కట్టింది గత ఆరు నెలలలో. తాత్కాలికంగా కాకుండా శాశ్వత కమ్యూనికేషన్ సెంటర్ లని నెలకొల్పింది. కొన్ని చోట్ల అత్యాధునిక 5 g నెట్వర్క్ ని ఇన్స్టాల్ చేసింది. ఇదంతా ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్ సైనిక కమాండ్ సెంటర్ తో అనుసంధానం చేసి అక్కడనుండి నిర్ణయాలు వెంటనే మన సరిహద్దుల దగ్గర ఉన్న కమాండర్ల కి ఆదేశాలు ఇచ్చేందుకే ఇదంతా చేస్తున్నది చైనా.
గత సంవత్సరం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చలిలో , చీకటిలో మన బీహార్ రెజిమెంట్ చేసిన దాడి అనంతరం చైనా సైనికులు పారిపోతున్నా వెంటాడి వట్టి చేతులతో కొట్టి ముఖాలు కూడా గుర్తుపట్టలేనంతగా తీవ్రంగా గాయపరచడం ఈ విషయాలని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టడం చైనా భయాలకి కారణం అయి ఉండవచ్చు లేదా భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉండబోతుందో తెలియచేసే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు ఏదో విధంగా దాడి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసి పరోక్షంగా తనకి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ కి ఒక దోవ చూపించడం ప్రస్తుత సైనిక విన్యాసాల లక్ష్యం అయి ఉండవచ్చు.
కానీ …. మన బిపిన్ రావత్ ఆలోచన వేరుగా ఉంది. అదేంటో ఇప్పిటి కిప్పుడు అంచనా వేయలేము కానీ చైనా పసిగట్టి ఉండవచ్చు ఎందుకంటే మన మీడియాలో కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మనకి తెలిసే విషయాల కంటే చైనా నిఘా వర్గాలకే ఎక్కువ తెలుస్తుంది.
జై హింద్ !
-పార్ధసారధి పోట్లూర