తెలంగాణలో రాష్ట్రములోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని జీవన సాగిస్తూ ఉంటారు. వ్యవసాయ కార్యాకలాపాలకు శుభప్రదంగా భావించే రోజు ‘పొలాల అమావాస్య’. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు అత్యంత ముఖ్యమైన పండగరోజు ఇది. పొలాల అమావాస్య సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. శివ, నారద పురాణాలలో కూడా పొలాల అమావాస్య గురించిన ప్రస్తావన ఉంది. దీనిని వ్యవసాయదారులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయదారులు శ్రావణ మాస చివరి రోజుల్లో పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకుంటారు.
పొలాల అమావాస్య పండుగ సాధారణంగా గ్రామం లోని హనుమాన్, పోచమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేసి ఇంట్లో పిండి పదార్థాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముఖ్యంగా బసవేశ్వరుడి రూపంలో ఉన్న ఎద్దులను కొలుస్తూ పొలాల అమావాస్య రోజు వాటికి ఆతిథ్యాన్ని అందజేస్తారు. పొలాల అమావాస్యను రైతుల అమావాస్య గా, వ్యవసాయ అమావాస్యగా కూడా పిలుస్తారు.
శ్రావణ మాసంలో ముగింపు అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో ‘నిరంతరము భక్తుల పూజలందుకునే నీవు.. నీ నందివా హనుడికి కూడా పూజలందుకునే అవకాశాన్ని కల్పించలే కపోయావా!?” అని కోరిందట. అప్పుడు శ్రావణ మాసం చివరి రోజయిన అమావాస్య నాడు పొలాల అమావాస్య పేరుతో బసవన్నలను పూజించుకొనే వరాన్ని ప్రసాదిం చాదట శివుడు’. అని మన పూర్వీకులు పొలాల విశిష్టతను చెప్తుంటారు. పొలాల అమావాస్య రోజు నందిశ్వరుడినిపూజిస్తే సాక్ష్యాత్తు ఆ శివపార్వతులు ఆశీర్వదిస్తారని రైతుల ప్రగాఢ విశ్వాసం, పొలాల అమావాస్య మూడు రోజుల పండుగ.
మొదటి రోజు ఉప్పులు :
ఆరుగాలం అష్టకష్టాలు పడి పంటలను పండించి, తన కుటుంబ అవసరాలకు కొంత ధాన్యాన్ని ఉంచుకొని మిగతాది మారకం చేయడం ద్వారానే ఈ జగతికి వెన్నుముకగా నిలుస్తున్నాడు రైతు. అలాంటి రైతుకు అండగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎద్దులను ‘ఉప్పులరోజు’ ఉదయాన్నే కొమ్ములు సరిచేసి సాయంత్రం నాలుకపై ఉప్పును రాకి, తినిపిస్తారు. కలుపు మొక్కలు, పసరుగడ్డి మొదలైన వి తిని వాటి నాలుక మొద్దుబారిపోయి ఉంటుంది. ఉప్పు తినిపించడం ద్వారా నాలుక అంతా శుభ్రం అవుతుంది. తదుపరి మోదుగ కొమ్మలు, రెల్లుగడ్డి (దర్భ) తో ‘ఏంచే స్తున్నావ్?” అని మాలక్ అంటే.. పాలేరు ‘బర్లు (బరులు) దించుతున్న’ అంటూ ఎద్దుల వీపు పైన సుతారంగా రాకుతారు పూజచేసి వాటి నాలుక. వీపు పైపసుపు రాసి మంచినూనె తాగిస్తారు. ఎంతో బరువులు మోసిన ఎద్దుల బరువులను తగ్గించడమే ఉప్పల పండగ ప్రాధాన్యత
ఉప్పు తినిపించడం వల్ల వాటి జీర్ణాశయంలో పేరుకు పోయిన మలినాలను పూర్తిగా తొలగించడం. నూనె తా గించడంతో జీర్ణాశయాన్ని మామూలు స్థితికి తీసుకురా వడం, అలాగే పసుపు అంటీబయోటిక్ గా పని చేయడం వంటి శాస్త్రీయ అంశాలు.
రెండవ రోజు బసవన్న పండుగ
పొలాల రోజున ఎద్దులను ప్రత్యేక ఆకర్షణగా అలంక రిస్తారు. ఉదయం ఎద్దులను సమీప వాగులు, జలాశ యాలలో శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి, బుగ్గలు, రంగు రంగుల పేపర్లతో కొమ్ములను, గంటలు, గజ్జెలు. గుగ్గుర్లతో వాటి గంగడోలును అలంకరిస్తారు. వివిధ అల్లికలు, ఎంబ్రాయిడరీలతో తయారు చేసిన జూ న(వస్త్రం) తోమూపురం నుంచి తోక దాకా చూడచక్కగా ముస్తాబు చేస్తారు. సాయంత్ర సమయాన గ్రామంలో ని ప్రజలంతా ఒకచోట చేరుకుంటారు. ఆనవాయితీ, సాంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్ద లేదా పటేల్ లేదా పెద్దకాపు ఇంటి నుంచి ఊరేగింపుగా డప్పు వాయి ద్యాలతో రైతులంతా సామూహికంగా బసవన్నల తో బయలుదేరి గ్రామములోని దేవాలయల చుట్టూ ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ మహాదేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షణాలు చేయిస్తారు. తదుపరి ఇళ్ల వద్ద ప్రత్యేకంగా వండిన పిండివంటలను తాంబు లాలను నైవేద్యాలుగా సమర్పించుకుని, బంధువులను, స్నేహితులను పిలుచుకొని రైతు తన పాలేరుకు కొత్త బట్టలు, డబ్బులను కృతజ్ఞతగా సమర్పించుకుంటారు. పొలాల అమావాస్యలో శాస్త్రీయత అనేది కూడా దాగి ఉంది పొలాల అమావాస్యకు ముందు రోజు బసవన్న లకు ఉప్పులు పెట్టడం వల్ల పొలాల అమావాస్య రోజు ఊర్లో బసవన్నలను తింపడం జరుగుతుంది. బసవన్న లకి ముందు రోజు ఉప్పులు పెట్టడం వల్ల బసవన్నలు పుర్రు పోసుకుంటూ ఉంటాయి. శ్రావణ మాసంలో అనేక రకాలైన వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి. అలా రోగాల బారిన పడకుండా బసవన్నల పెండ అనేది ఊరు
మొత్తం రోడ్ల మీద వేయడం వల్ల సూక్ష్మ జీవనాశనిగా కూడా అది పనిచేస్తుందని శాస్త్రీయంగా తెలుస్తున్నది.
మూడవరోజు బొడిగె:
పవిత్రమైన శ్రావణ మాసంలో చాలామంది ప్రజలు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. నెలరోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండడంతో బొడిగె రోజున బృందాలుగా ఏర్పడి మేకలను కోసుకొని పాలు (భాగం) వేసుకుంటారు. కోళ్లు, మేకలకు ఈ రోజు భలే గిరాకీ ఉంటుంది. శాస్త్రీయంగా బొడిగెను పరిశీలిస్తే శ్రావణ మాసంలో అధికంగా వర్షాలు కురు స్తాయి. దీనివల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధం. శారీరక సంబంధ రు గృతలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కోళ్లు, మేకలు, చేపలకి శ్రావణ మాసంలో వివిధ రకాలైన వ్యాధులు వస్తాయి. కావున వాటిని తినడం వల్ల వాటి నుంచి మనకి అనేక రకాలు అయిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే నాడు మన పూర్వీకులు ఈ మాసపు రోజుల్లో మద్యానికి, మాంసానికి దూరంగా ఉండేవారు. శ్రావణ మాసంలో అధిక వర్షాల వల్ల వ్యాప్తి చెందే బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు వంటి అనేక రకాలు అయిన సూక్ష్మ జీవులు పొలాల నాటి ఎద్దులు పేడతో అంతరిస్తాయి. శ్రావణమాసం తరువాత వర్గాల జోరు కూడా తగ్గుతుంది. కొందరు మట్టితో ఎద్దులను చేసి పూజలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యే కంగా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుం టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో సైతం బసవన్నలు ఈ ప్రత్యేక దినాన పూజలు అందుకుంటాయి. ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగ పెట్టింది పేరు. యాంత్రిక కాలంలో బసవన్నల జోరు తగ్గిన రైతన్నల పోరుమాత్రం ఆగదు. భారతీయ వాతావరణ ఋతువులు, కాలగమనం ప్రకారం శరీర ములో, శరీరతత్వంలో మార్పులు వస్తాయి. ఆయా మా ర్పులకనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండగలు పండుగల రోజు వివిధ ధాన్యాలతో చేసిన పిండి వంటలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య రోజును మాతృ దినోత్సవంగా జరుపు కుంటూ కందమొక్కను పూజించడం శుభప్రదం అని భావిస్తారు.
More Photos: