ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లాబరాదర్ పేరు ఖరారైంది. తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్ అధిపతిగా ఉన్న ఆయన పేరును ఇతర ముఖ్యులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఉర్జాన్ ప్రావిన్స్ లో పుట్టిన బరాదర్ కాందహార్లో పెరిగాడు. అప్పట్లో ముల్లా ఒమర్ తో కలిసి సోవియెట్ సేనలపై యుద్ధంచేశాడు. సోవియట్ సేనలు ఆప్గనిస్తాన్ నుంచి వెళ్లిపోయాక దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ముల్లాఒమర్ తో కలిసి తాలిబన్ ను స్ధాపించాడు. చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న బరాదర్ ను..2010 ఫిబ్రవరిలో పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, అమెరికాకు చెందిన సీఐఏ సిబ్బంది కరాచిలో అదుపులోకి తీసుకుంది. 2018లో అమెరికా ఒత్తిడితో పాక్ బరాదర్ ను రిలీజ్ చేసింది. తర్వాత ఖతార్లో ఉంటూ తాలిబన్ పొలిటికల్ ఆఫీస్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాడు.