నక్సలైట్లకు పెద్దమొత్తంలో నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ఢిల్లీకి చెందిన బంగ్లాదేశ్ మహిళను జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఖుల్నాకు చెందిన కనీజ్ ఫాతిమాగా గుర్తించారు. ఏడేళ్ల క్రితం అక్రమంగా భారత్ వచ్చి అంజలీ పటేల్‌గా పేరు మార్చుకుని ఢిల్లీలో ఉంటున్నట్టు పోలీసులు నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన తరువాత ముందు బెంగళూర్‌లోని ఓ మసాజ్ పార్లర్లో పనిచేసేది. తరువాత డిల్లీలో మరో పార్లర్లో చేరింది. అప్పుడే నిషేధిత నక్సల్ సంస్థ PLFI చీఫ్ దినేష్ గోప్ కు ఆయుధాలు సరఫరా చేసే నివేష్ కుమార్ తో పరిచయం ఏర్పడింది.
వారం క్రితం పీఎల్ఎఫ్ఐ కార్యకర్తలు కొందరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నివేష్ ఉన్నాడు. బిహార్ కు చెందిన నివేష్ రాంచీలోని దూర్వాలో స్థిరపడ్డాడు. గతంలో పలు చీటింగ్ కేసుల్లో అరెస్టయ్యాడు.
అతని నుంచి , మేము రెండు SUVలు, 71 లక్షల నగదు, దాదాపు డజను స్లీపింగ్ బ్యాగ్‌లు మరియు జంగిల్ వార్ఫేర్లో ఉపయోగించిన టెంట్లను స్వాధీనం చేసుకున్నాము. BMW, థార్ లు చాలా ఖరీదైనవని పోలీసులు తెలిపారు.
అటవీ ప్రాంతంలో వాడేందుకు థార్ వీలుగా ఉంటుంది. ఇంకా నక్సలైట్లకు సరఫరా చేసేందుకు సేకరించిన టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అతని మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ పరీక్షలో అత్యాధునిక ఆయుధాల వివరాలు, ఆయుధాల స్మగ్లర్లతో కొన్ని అనుమానాస్పద చాటింగ్‌ల వివరాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఆ విచారణ సందర్భంగానే బంగ్లాదేశ్ మహిళ గురించి పోలీసులకు తెలిసింది.
దీంతో ఆమెను ఢిల్లీలో అరెస్ట్ చేసి రాంచీ తీసుకువచ్చారు. మరింత కీలకమైన రహస్య సమాచారం ఆమె దగ్గర ఉందని పోలీసులు చెబుతున్నారు. సమగ్ర విచారణకు రిమాండ్ కోరనున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాకు చెందిన ఆయుధాల స్మగ్లర్లతో నివేష్కు సంబంధాలు ఉండవచ్చనే విషయాన్ని తోసిపుచ్చలేమని రాంచీ పోలీసు ఉన్నతాధికారులంటున్నారు.
నివేశ్ తరచూ ఢిల్లీ, కోల్ కతా సహా పలు నగరాలను సందర్శిస్తుంటాడు. ఢిల్లీలో త్రీ స్టార్ హోటల్ లో ఫాతిమాతో మసాజ్ చేయించుకునేవాడు. ఈ హోటల్ బసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అది నివేశ్ దనే చెబుతున్నారు. డిల్లీలో అక్రమంగా ఉంటున్న ఫాతిమా ఉగ్రవాదులకూ వసతినిచ్చేదని చెబుతున్నారు. విచారణలో నివేశ్ తనను పెళ్లి చేసుకున్నాడని అందరికీ భార్యగానే పరిచయం చేశాడని పోలీసుల ముందు చెప్పింది. తన దగ్గర ఉన్న నకిలీ ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు ఓ కుమార్తె ఉందని తను బంగ్లాదేశ్ లో ఉందని తెలిసింది. మొదటి భర్తను, కుమార్తెను అక్కడే వదిలేసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఫాతిమా జల్సాలకు అలవాటే నివేశ్ కు దగ్గరైంది. అలా అతనితో కలిసి నక్సల్స్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోంది. అటు నివేశ్ తండ్రి సోదరులనూ అరెస్ట్ చేసిన పోలీసులు వారినీ విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.