కొంతకాలంగా బంగ్లాదేశ్ పేరు భారతీయ సమాజంలో బాగా నానుతోంది. అక్కడ హిందువుల మీద అన్యాయంగా దాడులు జరిగిపోతున్నాయి. కొట్టడం తిట్టడం తరమడం కామన్ అయిపోయాయి. మహిళలను వేధించడం, వ్యాపారాలకు నిప్పు పెట్టడం సాధారణ అయిపోయింది. అనేకమంది హిందువులను అన్యాయంగా కొట్టి చంపేశారు. ఇస్కాన్ గురువు చిన్మోయి వంటి హైందవ పెద్దలను వేల సంఖ్యలో అక్రమంగా జైళ్ళలోకి కుక్కేశారు. ఇది చాలా అన్యాయమని భారత సహా అనేక దేశాలు చెబుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోవడం లేదు .
కానీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆహార ధాన్యాలు తగ్గిపోయేసరికి ఏమాత్రం సిగ్గుపడకుండా నోరు తెరిచి భారత్ ను అన్నం కోసం అడుక్కుంటున్నది.
బంగ్లాదేశ్ కు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చింది. మొదటినుంచి భారత దేశమే సబ్సిడీ రేట్ కి ఆహార ధాన్యాలు అందిస్తూ అక్కడ సమాజాన్ని ఆదుకుంటున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 26.25 లక్షల టన్నుల బియ్యం కావాల్సి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, అంత పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకోడానికి బంగ్లాదేశ్ ఆర్థిక స్తోమత సరిపోదు. ఈ యేడాది బంగ్లాదేశ్‌ను కుదిపేసిన వరదల్లో 11లక్షల టన్నుల బియ్యం పాడైపోవడమూ ఆ దేశానికి నష్టమే కలిగించింది. దీంతో భారత్ ను అడుక్కోక తప్పడం లేదు.
ఇప్పుడు బంగ్లాదేశ్ కచ్చితంగా దిగిరావలసిన పరిస్థితి.
డిసెంబర్ 17 నాటికి బంగ్లాదేశ్ దగ్గరున్న తిండిగింజల నిల్వలు 11.48 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. వాటిలో బియ్యం నిల్వలు కేవలం 7.42 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యమే ఆహారంగా ఉండే దేశానికి అది అత్యంత ప్రమాదకరమైన స్థాయి.
బంగ్లాదేశ్ కి పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు అవసరం. భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యాన్ని ప్రభుత్వ ప్రాయోజిత ఆహార సరఫరా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచిపెడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 11.17 లక్షల టన్నుల బియ్యాన్ని అలాంటి పథకాల ద్వారా పంచిపెట్టింది.
బంగ్లాదేశ్‌కు బియ్యాన్ని భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు సరఫరా చేస్తుంది. టన్నుకు 456.67 డాలర్ల రేటుకు బియ్యం ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ ధర. నవంబర్ నెలలో బంగ్లాదేశ్‌కు సరఫరా చేసిన బియ్యానికి టన్నుకు 477 నుంచి 499.8 డాలర్ల వరకూ చెల్లించారు. అంటే, భారతీయ కంపెనీలు పెద్దమొత్తంలోనే సబ్సిడీ ఇస్తున్నాయి అన్నమాట.
ఇదంతా భారత ప్రభుత్వం సహకారంతోనే సాధ్యమవుతున్నది. దీంతో అన్నం కోసం మరోసారి భారత్ దగ్గర బంగ్లాదేశ్ చేయి చాపుతోంది. ఇక్కడ మరో విషయం గమనించాలి. బంగ్లాదేశ్ లోని హిందువుల మీద దాడుల్ని నియంత్రిస్తాము మైనార్టీలకు రక్షణ కల్పిస్తాము అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమాత్రం చెప్పడం లేదు. ఆహార పదార్థాలు ఇప్పించండి ప్లీజ్ అని మాత్రం పదేపదే అడుగుతోంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని.. బంగ్లాదేశ్ లోని ప్రజల ఆహార అవసరాలు దృష్టిలో పెట్టుకొని.. ఆహార ధాన్యాలు పంపించేందుకు అంగీకారం తెలిపింది.