………………………………………………..
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పేరుకి కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ, కమ్యూనిస్ట్ భావాలే అత్యధికం. దేశాన్ని సంఘటిత పరచటం ఇష్టం ఉండదు, సమాజాన్ని చీలికలు, పేలికలు చేయాలన్న కమ్యూనిస్ట్ భావజాలాన్ని అమలు చేస్తుంటారు. అందుచేతనే సమాజంలో ఐకమత్యం ఉండకూడదని కోరుకొంటూ ఉంటారు. ఇదే క్రమంలో ఒక నీచపు ఆలోచనకు దిగారు.
……………………..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్నాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జాతీయ భావాలను వ్యతిరేకించటంలో సిద్ధరామయ్య బాటలోనే నడుస్తూ ఉంటారు.
ఇటీవలనే… ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై కర్ణాటకలో నిషేధం విధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. దీనితో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నెల 18న ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా 10 మందికి మించి ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం చట్టవిరుద్ధం అని ప్రకటించింది. ప్రభుత్వ మైదానాలు, విద్యాసంస్థల ఆవరణలను వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది.
…………………………….
అయితే, రాష్ట్రంలో ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంతా మండిపడుతున్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయం మీద సీరియస్ అయింది. సమాజాన్ని సంఘటితం చేసే పనులను అడ్డుకోవటంలోని ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. ఇటువంటి ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం … ఏమయినా సాధించాలని కోరుకొంటోందా అని నిలదీసింది. దీనికి నీళ్లు నమిలిన కర్నాటక ప్రభుత్వ న్యాయవాదులు.. తర్వాత సమాధానం చెబుతామని టైం అడిగారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం మీద స్టే విధిస్తూ.. కర్నాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.



