బ్యాన్ చేసిన తరువాత కూడా పేరు మార్చుకుని దేశంలో అందుబాటులోకి వచ్చిన పబ్జీ గేమ్ బీజీఎంఐ పైనా నిషేధం విధించింది కేంద్రం. బీజీఎంఐ(BGMI) అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరోసారి ప్రభుత్వ ఆదేశాలతో ఈ గేమ్ కూడా బ్యాన్ అయిపోయింది. దేశ యువతను.. ముఖ్యంగా పిల్లలు ఈ యాప్ కు ఎడిక్ట్ అయిపోయి ప్రాణాలు సైతం తీసుకున్న సందర్భాలున్నాయి. దీంతో ఆప్పుడు పబ్జీని కేంద్రం బ్యాన్ చేయగా…ఇప్పుడు బీజీఎంఐనూ నిషేధించింది.
ఇక ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి గూగుల్, ఆపిల్ సంస్థలు గురువారం బీజీఎంఐని తమ సంబంధిత యాప్ స్టోర్ల నుంచి తొలగించేశాయి. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ వినియోగదారులను అధిగమించిందని బీజీఎంఐ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశంలో అత్యంత మంది ఇష్టపడే గేమ్‌గా బీజీఎంఐ ఏడాది పూర్తి చేసింది.