బజరంగ దళ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు..
కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 1990దశకంలోలాగే హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని బజరంగదళ్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే హింసకు పాల్పడుతున్నారన్నారు. జమ్ము కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370, 35A లను తొలగించిన తరువాతనే మళ్లీ హింస నెలకొందన్నారు.
కశ్మీర్ హిందూ సమాజంతో భజరంగ్ దళ్ అండగా ఉంటుందన్నారు. పలుచోట్ల పాకిస్తాన్, ఉగ్రవాదం దిష్టిబొమ్మలను దహనం చేశారు.