ఛత్తీస్ గఢ్ లో ఘర్ వాపసీ ఉధృతంగా సాగుతోంది. తాజాగా 4 వందల కుటుంబాలకు చెందిన 12 వందలమంది ఒకేసారి తిరిగి హిందూమతంలోకి వచ్చారు. బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ నేతృత్వంలో జరిగిన ‘వైదిక జ్ఞాన గంగా విశ్వకళ్యాణ మహాయజ్ఞం’ వేదిగ్గా వారంతా తిరిగి హిందూధర్మంలోకి చేరిపోయారు. ఈనెల 19, 20 తేదీల్లో జష్పూర్ జిల్లాలోని ఖంతపాణి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. క్రైస్తవ మిషనరీల ప్రలోభాలతో మతంవారిన దాదాపు 12 వందలమంది తిరిగి స్వధర్మంలోకి వచ్చారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత దిలీప్ సింగ్ జుదేవ్ కుమారుడే ప్రబల్ ప్రతాప్. దిలీప్ గతంలో వాజ్ పేయి సర్కారులో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనూ ఆయన క్రైస్తవంలోకి వెళ్లిన వారిని తిరిగి స్వధర్మంలోనికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. క్రిస్టియన్ మిషనరీల బారినుంచి హిందువులను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన వారసుడిగా ప్రబల్ ప్రతాప్ కూడా గిరిజన ప్రాంతాల్లో మతంమారినవారిని ఘర్ వాపసీ తీసుకువస్తున్నారు.
తండ్రి మరణించిననాటినుంచి ఆ బాధ్యత తాను తీసుకున్నానని… ఛత్తీస్గఢ్, జార్ఖండ్ , ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటివరకు పదివేలమందిని ఘర్ వాపసీ తీసుకువచ్చానని అంటున్నారు ప్రబల్ ప్రతాప్. కరోనా కారణంగా ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగిందనిమళ్లీ ఇప్పుడే వేగం పెంచామని తెలిపారు. దేశ నిర్మాణంలో దీన్ని కూడా పవిత్రకార్యంగానే భావిస్తోంది ఆకుటుంబం.
ఛత్తీస్ గడ్ లో ముఖ్యంగా మూరుమూల గిరిజనప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల ప్రభావం ఎక్కువ. పెద్దసంఖ్యలో గిరిజనులను మతం మార్చారు. హిందూదేవీదేవుళ్లను అవమానించడం, సేవపేరులో ఒప్పందాలు చేసుకోవడం.. మాయమాటలు చెప్పి అమాయకుల్ని లోబరుచుకోవడం వంటి పనులు అక్కడి మాఫియా చేస్తోందని ప్రబల్ ప్రతాప్ ఆరోపిస్తున్నారు. అయితే కొంత కాలంగా హిందువులు చైతన్యం అవుతున్నారు. ..తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల వైపే మొగ్గుచూపుతున్నారు. తమ మూలాల ప్రాధాన్యతను గుర్తించి వారసత్వాన్ని నిలుపుకోవాలనుకుంటున్నారు. వాళ్లలో వచ్చిన మార్పుతో తమ పని మరింత సులభం అవుతోందని…వాళ్లు ఎంతో ఇష్టపూర్వకంగా తిరిగి హైందవం స్వీకరిస్తున్నారని ప్రబల్ ప్రతాప్ అంటున్నారు.
దేశంలో ఎక్కువగా మతమార్పుళ్లు జరుగుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ ముందుంది. ఇక కరోనా మహమ్మారి ఒక కారణం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం రెండవకారణమని అక్కడి బీజేపీ నాయకులు అంటున్నారు. “కరోనావైరస్ పేరు చెప్పి మిషనరీలు అక్కడ తిష్టవేసి వాళ్లని మతం మారిస్తే…అధికార కాంగ్రెస్ క్రైస్తవ మాఫియాకు ఆండగా నిలిచిందని ఆయన అంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో భారతదేశంలోని చర్చిలు 50,000 గ్రామాలను దత్తత తీసుకున్నాయని లెక్కలతో వివరిస్తున్నారాయన.
ఆ కాలంలోనే దాదాపు లక్ష మంది క్రైస్తవులుగా మారారు. ప్రతీగ్రామాల్లో చర్చిల నిర్మాణం చేపట్టారని…కరోనా సమయంలో దేశంలో నిర్మించిన చర్చిల సంఖ్య…గత 25 ఏళ్లలో నిర్మించిన చర్చిల సంఖ్యతో సమానమని ….ఇప్పుడు లక్షలాదిగా ఏసును నమ్ముతూ ప్రార్థనలకువెళ్తున్నారని ఆందోళనగా చెప్పారు.
ప్రణాళికా బద్దంగా గిరిజన ప్రాంతాల్లో మిషనరీలు పనిచేస్తున్నాయి. నిరుపేద కుటుంబాలే వారి లక్ష్యం. వారి సమస్యల్ని పరిష్కరించే నెపంతో, అవసరాలు తీర్చే సాకుతో వచ్చి అక్కడ తిష్ట వేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం అందుబాటులో ఉంచుతూ వారిని మార్చేస్తున్నారు. అదేసమయంలో అమాయకుల గిరిజనుల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారని తెలిసింది. కోర్వా ప్రజల భూములు లాక్కున్నట్లు స్థానిక బీజేపీ నాయకులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇక దేవీదేవుళ్ల విగ్రహాలను అవమానించడం…హిందువుల పురాణాలు, వేదాలగురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేయడం ఎక్కువగా ఉంది.
అయితే ఈ మధ్య కాలంలో యువత చాలా చైతన్యవంతం అయ్యారని ప్రబల్ ప్రతాప్ చెబుతున్నారు. దయచేసి ఎవరూ మతం మారవద్దని… హిందుత్వ అనేది కులమో మతమోకాదు జాతీయతకు చిహ్నం అని ఆయన ప్రచారం చేస్తున్నారు. మతం మారడం అంటే మరో మతాన్ని అవమానించడం కాదని…ఎవరైనా హిందుత్వమీద దాడి చేస్తే ప్రతిఘటించాలనీ పిలుపునిస్తున్నారు.