సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర సాగింది. తమ అభిమాననటుడిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు జనం. ఆయన సినీ సహచరులు, ప్రముఖులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి భౌతికకాయం చేర్చిన తరువాత వారి కుటుంబ ఆచారం ప్రకారం నుదుటిన వైష్ణవ నామం పెట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సహా రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు.మహేశ్ సహా ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు.
https://twitter.com/INNChannelNews/status/1592848239392616450?s=20&t=FRa_-2gFG14ZqtkTjm5ThQ