బాబ్రీకట్టడం కూల్చివేతకు నేటితో 30ఏళ్లు. 1992లో ఇదే రోజు కరసేవకులు రామజన్మభూమిలో బాబర్ అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆతరువాత అక్కడ రాముడి ఉనికి నిజమంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు భారతీయులంతా రామమందిరాన్ని నిర్మించుకుంటున్నారు. నాటి ఘటనను హిందూసంఘాలు, రామభక్తులు శౌర్య దినోత్సవంగా జరుపుకోగా..ఇన్నేళ్లు డిసెంబర్ 6ను బ్లాక్ డేగా ప్రకటిస్తూ వచ్చారు ఈ దేశంలోని సెక్యులర్, ఉదారవాదులు.
ఇక ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన పలువురు సోషల్మీడియా వేదిగ్గా హల్చల్ చేశారు. బాబ్రీజిందా బై, డిసెంబర్ 6, బాబ్రీ మసీదు వంటి హాష్ ట్యాగ్ లు ట్రెండయ్యాయి.
https://twitter.com/ImFaiz_07/status/1599800669300408320?s=20&t=ax0AHqhFmKDcY4cHuS9EhA
ఫైజల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ రోజును బ్లాక్ డేగా పేర్కొనగా..మరో వ్యక్తి అక్కడ గుడి కట్టేందుకు బాబ్రీ మసీదును కూల్చేశారని రాసుకొచ్చాడు. అయినా ఆస్థలాన్ని మేం మసీదుగా గుర్తిస్తాం. అక్కడి బలమైన ముద్రను ఎవరూ తుడిచిపెట్టలేరని ట్వీట్ చేశాడు. ఇక మరో యువకుడు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఎంఐఎం చీఫ్ అసద్ వీడియోను జతచేశాడు. అందులో అసద్ హిందువులను రెచ్చగొడ్తున్న ప్రసంగం ఉంది. బాబ్రీని మేం ఎన్నటికీ మరిచిపోలేం..ఇన్షా అల్లా. డిసెంబర్ 6 బ్లాక్ డే అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడతను.
ఇక ఎంఐఎంకు చెందిన మరో నాయకుడు అక్తరుల్ ఇమాన్…. 1992 నాటి ఘటనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ నాడు హిందువులు చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని రాశాడు. “మసీదులో విగ్రహాన్ని నెలకొల్పింది నెహ్రూ, బాబ్రీ తాళం తెరిచినది రాజీవ్ గాంధీ, కూల్చివేతకు సహకరించింది పీవీ.అయినా సృష్టి అంతంవరకు బాబ్రీ గుర్తులు మా హృదయాల్లో నిలిచే ఉంటాయని ట్వీట్ చేశాడు.
https://twitter.com/PMN967787/status/1599850393277976576?s=20&t=C823mPr93Du86ZCSc2mevg
కొందరైతే గీతదాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టులు చేశారు. దాన్ని కూల్చివేసిన వారు ఒకరోజు నాశనం అవకతప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మసీదును కూల్చివేశారని..వాళ్లు టెర్రరిస్టులని ఓ వ్యక్తి అంటే… ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు అక్రమంగా తమ మసీదును కూలిస్తే దోషులను ఇంకా శిక్షించలేదని మరో యువకుడు రాసుకొస్తూ… బాబ్రీ న్యాయం కోసం వేచిచూస్తున్నాం అని హాష్ టాగ్ జోడించాడు.
30ఏళ్లు అయిఉండవచ్చు…300 ఏళ్లు కూడా గడవొచ్చు..అయినా అక్కడ మళ్లీ మసీదు మాత్రం నిర్మించుకోవడం ఖాయం అని మరొకరు రాసుకొస్తే….బాబ్రీ మసీదు కూల్చివేతకు 30 ఏళ్లు. మేము ఎప్పటికీ మరచిపోం, మిమ్మల్ని క్షమించబోం అని మరో వ్యక్తి విద్వేషపు ట్వీట్ చేశాడు.
https://twitter.com/AkhtarulImanMLA/status/1599834183060574209?s=20&t=FsbzNbNhpFE5n7LkAvZfbw
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా కార్యకర్త, షరియా కమిటీ హైదరాబాద్ అధ్యక్షురాలు డాక్టర్ అస్మా జెహ్రా తయేబా ట్వీట్ చేస్తూ, “మేము మరచిపోలేం, ఈ రోజును గుర్తుంచుకుంటాం.. మసాజిద్ ముస్లిం సమాజానికి కేంద్రంగా ఉంది. బాబ్రీ మసీదు పతనం, గత 30 ఏళ్లలో ముస్లింల స్థితిగతులు ఆత్మపరిశీలన అవసరం అని ట్వీట్ చేశారు. అక్కడ జరిగింది నిరంకుశ చర్య, అనాగరిక చర్య అది ఎప్పటికీ బ్లాక్ డేనే అని ఆమె అన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ట్వీట్ చేస్తూ… 1992 డిసెంబర్ 6 నాటి ఘటన గుర్తుచేస్తూ మొదటి అమరుడైన రామ్ కొఠారి, శరద్ కొఠారీకి నివాళులు అర్పిస్తూ జైశ్రీరామ్ అని ట్వీట్ చేశారు.
https://twitter.com/AsmaZehradr/status/1599978306316931073?s=20&t=CdVcP3PvtaPxw4a0JFY6GA