ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య మీద దాడి చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐ ఎస్ ఐ కుట్ర చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ గా పేరు పొందిన ఐ ఎస్ ఐ .. అక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, అయోధ్య లో భవ్యమైన రామమందిరం కట్టుకొని భారతీయులంతా పూజించుకోవటం చూసి,, కడుపు మంటతో ఐ ఎస్ ఐ కుట్రలకు పాల్పడింది. రామ మందిరం మీద దాడి చేసేందుకు ఫైజాబాద్ లోని మటన్ వ్యాపారి అబ్దుల్ రెహ్మాన్ ను ప్రేరేపించింది. ఇందుకోసం తాత్కాలికంగా రెక్కీ చేసిన రెహ్మాన్, ఆయుధాల కోసం ఐ ఎస్ ఐ ను ఆశ్రయించాడు. సంస్థ సూచన మేరకు హర్యానా లోని ఫరీదాబాద్ చేరుకొని ఆయుధాలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ సమాచారం అందుకొన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వల పన్ని పట్టుకొన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ కుట్ర విషయం మొత్తం బయట పడింది.
#BreakingNews: राम मंदिर पर हमले को लेकर खुलासा, ISI के ISKP मॉड्यूल से जुड़ा हुआ था अब्दुल रहमान #RanBhoomi #RamMandir #ISI | @gauravcsawant | @arvindojha pic.twitter.com/aVWxQDlg3c
— AajTak (@aajtak) March 3, 2025