బజార్హత్నూర్ మండలంలోని బొస్రా గ్రామంలోని ప్రజలకు బోథ్ సిఐ నైలు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సిఐ నైలు మాట్లాడుతూ “మండలంలోని పలు మారుమూల ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లో అంతర పంటలలో మిశ్రమ పంటలుగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు.. ఇది చట్టరీత్యా నేరం కనుక ఇలాంటి పంటలను సాగు చేసిన వారిని ప్రోత్సహించడం తప్పు కనుక అలా పండించిన పంటలను మా దృష్టి కి తేవాలని” తెలిపారు.
ఈ మధ్యకాలంలో చేడు వ్యసనాలకు బానిసై యువత పక్కదోవ పడుతున్న నేపథ్యంలో తమ పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు.. యువత గుట్కా, మట్కా, మద్యం వంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందేశ్వర్, ఎంపీటీసీ గజానంద్, గ్రామ పెద్దలు సహా యువకులు తదితరులు హాజరయ్యారు.