అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
భారత దేశ సైన్యాన్ని శక్తివంతం చేయడానికి ప్రవేశ పెట్టిన పథకమే ఇదని… దేశరక్షణలో యువశక్తి భాగస్వామ్యాన్ని పెంచి…ఇతర అగ్ర దేశాలకి దీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకొనే ఉద్దేశం తో యువతను అగ్నివీరులు గా తీర్చిదిద్ది భవిష్యత్తు కు బాటలు వేస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వివరించారు.
ఈ విధానం ఇప్పటికే అనేక దేశాల్లో ఉన్నది.ఇజ్రాయిల్ లో 18 నిండిన యువత తపపనిసరి ఆర్మీ లో కొంత కాలం పని చేయాలి .అందుకే అక్కడ దేశ భక్తి ఎక్కువ, చిన్న దేశం అయినా ఈ దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయరని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి అన్నారు.
అమెరికా కు ధీటుగా చైనా ఆర్థిక శక్తి గా ఎదిగినప్పటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని,ఆయుధాలను సమకూర్చుకోవడం తో అత్యంత బలమైన సైనిక శక్తి గా ఉందని ప్రముఖులు గుర్తు చేశారు. రష్యా లాంటి దేశాన్ని చిన్న దేశం అయిప్పటికి ఉక్రెయిన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైనిక శక్తి కలిగిన అందువల్ల యుద్ధం చేస్తున్నది.ఆధునిక యుద్ద తంత్రనికి తగినట్టు సైన్యాన్ని తయారు చేసుకునే అవసరం మనకు ఉన్నది.15 లక్షల సైన్యం ఇంకా పడి లక్షల reserve సైన్యం ఉన్నదని వక్తలు వివరించారు. కొన్ని పార్టీలు ,నాయకులు తమ స్వార్థం కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఆర్మీలో చేరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివేకానంద కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సుహాసినీరెడ్డితో పాటు… దారాట్ల కిష్టు ,మాజీ సైనిక అధికారి గడ్డం అశోక్ ,ప్రిన్సిపల్ రవి కుమార్ ,అశోక్ గారు,nyk director వెంకట్ సహా పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు.