ప్లాస్టిక్ భూతం సమాజానికి తీరని నష్టం చేస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లో తెలియచెప్పేందుకు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో మన తెలంగాణలో అనేక చోట్ల విద్యార్థుల ద్వారా సమాజంలోని పెద్దలకు తెలియ చేస్తున్నారు.
తాజాగా అదిలాబాద్ జిల్లా సోనాల గ్రామం లో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.
ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ర్యాలీని పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించారు. ప్లకార్డులు చేత బట్టుకొని విద్యార్థులు పాత బస్టాండ్, అంగడి బజార్, స్థానిక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు… చౌరస్తా వద్ద నృత్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నారుల చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు.