మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) ఆగ్నేయాసియా, మధ్య ఆసియాలో ISISకి అనుబంధంగా పనిచేస్తుంది. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జరుగుతున్న దైవదూషణ, మసీదు భాగాన్ని కూల్చిసినందుకు హిందువులపై దాడిచేస్తామని ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెదిరిస్తున్నట్టు వీడియోలో ఉంది. ISKP ప్రచార వీడియోలో కలుకెట్టియా పురాయిల్ ఇజాస్ అనే భారతీయ ఆత్మాహుతి బాంబర్ కూడా ఉంది.
Islamic State Khurasan Province (ISKP) has begun a news bulletin service through its mouthpiece AlAzaim foundation. The first news bulletin is focused on India and the issue of blasphemy. 1/4 pic.twitter.com/Sv4w2c7stA
— The Khorasan Diary (@khorasandiary) June 14, 2022
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ తాలిబాన్ తోపాటు దాని నాయకుడు ముల్లా యాకూబ్ CNN న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూపై విమర్శించింది. తాలిబాన్ ఆర్థిక మంత్రి అమీర్ ముత్తాకీని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) జాయింట్ సెక్రటరీ JP సింగ్‌తో కలిసినందుకు కూడా విమర్శించింది. సిక్కులపైనా దాడులు చేస్తామని అందులో బెదిరించింది.
ఇదిలావుండగా ఖురాన్ లోని నిజాలు చెప్పిన నూపుర్ కు కోటిరూపాయల నజరానా ప్రకటించారు భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ … దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ సెల్ యూనిట్ గురువారం తన్వర్‌ను అతని నివాసం నుంచి అరెస్టు చేసింది. నూపుర్ శర్మపై బెదిరింపులపై గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత …తన్వర్ ను అరెస్ట్ చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపుల కింద అతనిపై కేసు నమోదైంది. తన్వర్ ఇంతకుముందు కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తన్వర్ ను విచారిస్తున్నారు.