ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. కుటుంబంతో సహా హైదరాబాద్ కు వచ్చిన ధన్ ఖడ్ కు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ స్వాగతం పలికారు. కొన్ని రోజులుగా ధన్ ఖడ్ జాతీయ మీడియాలో సెన్సేషనల్ గా నిలుస్తున్నారు. రాజ్యసభ లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. వీటి మీద కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు.
అవిశ్వాస తీర్మానం లోని స్క్రిప్ట్ మీద ధన్ ఖడ్ పంచ్ లు వేశారు. బైపాస్ సర్జరీ కోసం కూరగాయలను కోసే కత్తిని ఎప్పుడూ ఉపయోగించొద్దని వ్యాఖ్యానించారు. మహిళా జర్నలిస్టులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఒక్కసారి పరిశీలించాలని జర్నలిస్టులను ఉద్దేశించి అన్నారు. ఆ నోటీసు చదివి తాను ఆశ్చర్యపోయనని.. మీరెవరూ ఆ నోటీసును చదవకపోవడం తనకు మరింత ఆశ్చర్యం కలిగించిందన్నారు. బైపాస్ సర్జరీకి ఎప్పుడూ కూరగాయలు కోసే కత్తిని ఉపయోగించొద్దని ఒకప్పుడు మాజీ ప్రధాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తనపై ఇచ్చిన నోటీసులు కూరగాయలు కోసే కత్తి కూడా కాదని అది తుప్పు పట్టిన కత్తి అని జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్.. ఈ వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.