బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు మనసును కలచివేస్తున్నాయి.
తాజాగా సునమ్గంజ్ జిల్లాలోని భంగాడోహర్ గ్రామంలో జాయ్ మహాపాత్రో అనే హిందూ యువకుడిని.. అమీరుల్ ఇస్లాం అనే స్థానిక వ్యక్తి అత్యంత కిరాతకంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపేశాడు .
కేవలం 20 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘోరం జరగడం ఇది రెండోసారి. మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది.
శాంతిగా జీవిస్తున్న నిరపరాధ హిందువులు మతం పేరుతో లక్ష్యంగా మారడం తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ప్రాణ భయంతో జీవించాల్సిన పరిస్థితి అక్కడి హిందువులకు ఏర్పడటం మానవ హక్కుల వైఫల్యానికి నిదర్శనంగా మారింది.
ఇళ్లలో ఉండే సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, కార్మికులు కూడా దాడులకు గురవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
………………………..
ఇప్పటి వరకు హిందువులపై జరిగిన హింసాత్మక ఘటనలు:
* హిందూ యువకుడిని గుంపుగా దాడి చేసి దారుణంగా హత్య చేయడం
* హిందూ ఆటో డ్రైవర్ను కొట్టి, కత్తితో పొడిచి చంపిన ఘటన
* రెండు వేర్వేరు ప్రాంతాల్లో హిందువులను హతమార్చిన సంఘటనలు
* హిందూ వ్యాపారులు, కార్మికులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం
* హిందూ నివాసాలపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేయడం
………………….
ఈ ఘటనలు హిందూ సమాజంలో భయాన్ని పెంచుతున్నాయి. తమకు కూడా సమాన హక్కులు, భద్రత కావాలంటూ హిందువులు కన్నీటి పర్యంతమవుతున్నారు హత్యలు, దాడులు ఆగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
………..
మొత్తానికి, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, భారత్ లోని చాలా పార్టీలు, సంస్థలు స్పందించటం లేదు.




