ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయనకు నివాళులర్పించారు. రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా దివంగత మాజీ ప్రధాని వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
https://twitter.com/ANI/status/1559361364480577537?s=20&t=8FlEsrdk5XXqEFqifjYsdQ
అటల్ బిహారీ వాజ్‌పేయి.. ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. ప్రముఖులంతా ఈ ఉదయం న్యూఢిల్లీలో ఆయన సమాధి ఉన్న స్మారక స్థలం ‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించారు. వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య కూడా ఈరోజు ‘సదైవ్ అటల్’ వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్లో నివాళులు అర్పిస్తూ అటల్ బిహారీ వాజ్‌పేయిని మన కాలంలోని అత్యున్నత నాయకుడిగా అభివర్ణించారు.