జాతీయ సుపరిపాలన దినోత్సవం నవభారతానికి నాంది…
దేశం గర్వించదగిన వ్యక్తి.. భారతదేశాన్ని ప్రపంచ దృష్టిలో విశ్వ విజేతగా నిలిపిన గొప్ప దార్శనికుడు దేశం కోసమే తన జీవితాన్ని ధారపోసిన
మార్గ నిర్దేశకుడు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్
1924వ సంవత్సరంలో డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు చిన్నప్పటినుండే ప్రజలకు ఏదో చేయాలి అనే తపనతో వివిధ సంస్థల్లో పని చేశాడు సాధారణ స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి చేరిన మహోన్నత వ్యక్తి
చదువుకున్న రోజులలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో
చేరి తన కల్పనకు బాటలు వేసుకున్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి చేపట్టిన మందిర ఉద్యమానికి బిజెపి రాజకీయ గళాన్ని ఇచ్చింది, రామ మందిర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలు శిక్షణ కూడా అనుభవించారు
1951లో జనసంఘ్ లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంబించారు
1957 సంవత్సరంలో రెండు ఎంపీ స్థానాల నుండి పోటీ చేసి ఒక స్థానం లో గెలిచి ఇంకొక స్థానంలో ఓడిపోయారు తర్వాత రోజుల్లో వాజ్ పాయ్ గారి పటిమను చూసి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏదో ఒక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు అని చెప్పారు అంటే అతని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు,*
వాజ్ పాయ్ గారి స్వయంకృషి ఎంతోమందికి ఆదర్శం.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి గెలిచింది అని
రాజు నారాయణ్ అనే వ్యక్తి 1971 వ సంవత్సరంలో అలహాబాద్ కోర్టు కి వెళ్ళాడు కోర్టులో నిజానిర్ధారణ కావడంతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయమని కోర్టు తీర్పించింది దీంతో ఇందిరాగాంధీ
అత్యవసర పరిస్థితి విధించింది, అప్పుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ జయప్రకాష్ నారాయణ సారథ్యంలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేసి
జైలు జీవితాన్ని కూడా గడిపాడు
అత్యవసర పరిస్థితి ముగిసిన తరువాత సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ జయకేతనం ఎగురవేసినప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు
1977వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో మొదటిసారిగా హిందీలో మాట్లాడిన మొదటి వ్యక్తిగా కీర్తి గడించారు.
జనతా పార్టీ నుండి బయటకు వచ్చి 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని
తన మిత్రులైన
లాల్ కృష్ణ అద్వానీ, బైరాన్ సింగ్ షేకావత్
తో కలిసి భారతీయ జనతా పార్టీనీ ఏర్పాటుచేసి
అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు( 1980-1986)
1996వ సంవత్సరంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి 13 రోజుల్లోనే రాజీనామా చేయవలసి వచ్చింది.
1998 వ సంవత్సరంలో బిజెపి ఎక్కువ సీట్లు పొంది బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ 13 నెలల అవది లోనే ప్రభుత్వం కుప్పకూలిపోయింది జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకే ఒక ఓటుతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన మొదటి వ్యక్తి అటల్ బిహారి వాజ్ పాయ్ ఆనాడు ఆయన కట్టుబడిన తీరు మాటల్లో వర్ణించలేము నీతి, నిజాయితీ, ధర్మం, సిద్ధాంతం కోసమే పని చేసిన వ్యక్తి అటల్ బీహారీ వాజ్ పాయ్ గారు.
ప్రస్తుతం మేము ఓడిన ధర్మం బ్రతికే ఉండాలి అని ప్రధానమంత్రి పీఠాన్ని కూడా తృణప్రాయంగా వదులుకొని రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు.
తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచి 2004 వరకు ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించాడు
ఒక గొప్ప మార్పుకు నాంది కూడా పడింది ఆ కాలంలో
1998 సంవత్సరంలో ఫొక్రాన్
అణు పరీక్ష నీ ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించి జరిపిన తీరు ప్రపంచ దేశాలే నిర్గాంత పోయేలా చేశారు
అణు పరీక్ష జరిపిన తర్వాత అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, వంటి దేశాలు ఎన్నో ఆంక్షలు విధించిన వాటి అన్నింటినీ అధిగమించి భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి వాజ్ పాయ్ గారు.
1999 సంవత్సరంలో జమ్ము కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతాన్ని కుటిల నీతితో పాకిస్థాన్ ఆక్రమించుకున్నప్పుడు ఆపరేషన్ విజయ్ తో వీరోచిత విజయాన్ని భారత్ అందుకుంది.
భారతదేశ చరిత్రలో లిఖించదగ్గ పరిణామం
స్వర్ణ చతుర్భుజియ నిర్మాణం
ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా
వంటి మహా నగరాలను కలుపుతూ నిర్మించిన రోడ్డు మార్గం ప్రతిపక్షాలను సైతం నిర్గాంత పోయేలా చేసింది అనేక రంగాలలో అనేక మార్పులను కూడా తీసుకొచ్చింది.
జెనీవాలో హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ సమావేశం జరుగుతున్నప్పుడు కాశ్మీర్ అంశం పాకిస్తాన్ తీసుకొస్తుంది అని తెలిసినప్పుడు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారు ప్రతిపక్ష నాయకుడైన
ఏబీ వాజ్ పాయ్ గారిని వెళ్ళమని సూచించాడు అంటే అంటే అటల్జి ఎంత రాజ నీతిజ్ఞుడో అర్థం చేసుకోవచ్చు.
2005 వయోభారం వలన శాశ్వత రాజకీయాలనుండి తప్పుకొని తన ఆప్తమిత్రుడైన లాల్ కృష్ణ అద్వానీ గారికి పార్టీని అప్పజెప్పారు
ఎల్ కే అద్వానీ అటల్ బిహారీ వాజ్ పాయ్ ల మధ్య సాన్నిహిత్యం మాటలో వర్ణించలేము.
అటల్ బిహారీ వాజ్ పాయ్ గారు 1992 సంవత్సరంలో పద్మ విభూషణ్
1993లో ఉత్తమ పార్లమెంటేరియన్ గా, అదే విధంగా భారతదేశం లోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను 2015 వ సంవత్సరంలో పొందాడు
భారతదేశానికి అటల్ బీహారి వాజ్ పాయ్ గారు చేసిన సేవలను గుర్తించి ఆయన జన్మదినమైన డిసెంబర్ 25ను జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
గత ప్రభుత్వాల అవినీతి పాలన చెత్త కుప్పలాగా పేరుకొని పోయి
దేశాన్ని చిన్న బిన్నం అయితే
వాజ్ పాయ్ అధికారం లో వచ్చాక ఎలాంటి అవినీతి లేకుండా సుపరిపాలన అందించడం
శ్రీ రాముని పాలన నీ గుర్తు చేసింది
వాజ్ పాయ్ ఒక గొప్ప కవి ఆయన ప్రసంగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూనే ఉండేవారు వాజ్ పాయ్ వేలాది మంది ముందు ,పార్లమెంట్ లో ప్రతిపక్షాల కి సమాధానంగా కవితాత్మకంగా జన రంజకంగా
పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రతి పక్ష నాయకులకి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా తన సుదీర్ఘ ప్రసంగం సాగేది
తన అభిమతం దేశ హితం
తన జీవితం దేశ సేవ
అంటూ దేశం కోసమే తన జీవితాన్ని అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారు 2018 ఆగస్టు 16వ తేదీన పరమపదించారు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ భారత ప్రభుత్వం ఆయన జయంతి నీ సుపరిపాలన దినోత్సవంగా జరుపుతోంది.
మునిగెల శ్రీధర్
పాత్రికేయుడు.