తెలుగు నాట హాట్ టాపిక్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం వైసిపి జనసేన నాయకులు కార్యకర్తలు.. వీరితోపాటుగా సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాలు వైపు చూస్తున్నారు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం వైసిపి చావో రేవో అన్నట్లుగా తలపడ్డాయి. హైదరాబాదు నుంచి కూడా వేల సంఖ్యలో జనం ఏపీకి వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో కూడా ఏపీ ఎన్నికల ఫలితాల మీద ఆసక్తి బాగానే నెలకొని ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈవీఎం మెషిన్ల ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి త్వరగానే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లెక్కింపు కేంద్రాల్లో టేబుల్స్ కుర్చీలు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గం కోసం విశాలంగా ఉండే హాలు ఏర్పాటు అయింది. ఇందులో 14 టేబుల్స్ ని లెక్కింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు పెడతారు. 14 టేబుల్స్ లోను లెక్కింపు పూర్తి అయితే ఒక రౌండ్ పూర్తి అయినట్లు. ఈ మాదిరిగా ఒక రౌండ్ పూర్తి చేయడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాత ఆ ఫలితాన్ని అక్కడ అందుబాటులో ఉన్న రాజకీయ పార్టీల ఏజెంట్లకు తెలియపరచి కౌంటింగ్ అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ కు సమాచారం ఇస్తారు. 8:30 9 గంటల మధ్యలో మొదటి రౌండు ఫలితాలు బయటకు వస్తాయి అప్పటినుంచి ఆధిక్యం అంచనాలు తెలుస్తూ ఉంటాయి. ఉదయం 10 గంటల సమయానికి ఎన్నికల సరళి అర్థం అయిపోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఏ పార్టీకి దక్కుతుంది అనేది తెలిసిపోతుంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు మొత్తంగా పూర్తవుతుంది. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు కొలిక్కి వస్తుంది. అత్యధికంగా ఓట్లు ఉన్న మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి కావచ్చు.
అదే కౌంటింగ్ కేంద్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా లెక్కింపు సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నానికి ఈ ఫలితాలు కూడా వెల్లడవుతాయి.
ఇటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినటువంటి ఈవీఎం మెషిన్లను కౌంటింగ్ కేంద్రాలకు భారీ బందోబస్తు మధ్య తరలిస్తారు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది ఆ తర్వాత ఈవీఎంలు తెరిచి వాటి లెక్కింపు చేపడతారు ఉదయం 10 11 గంటల సమయానికి ఆధిక్యం తెలిసిపోతాయి కాబట్టి తెలంగాణలో ఎంపీ సీట్లు భవితవ్యం అంచనా వేయవచ్చు.
దేశవ్యాప్తంగా ఒకేరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది కాబట్టి.. ప్రధానమంత్రి ఎవరు, అధికారం ఏ పార్టీది అనేది కూడా జూన్ 4వ తేదీ మధ్యాహ్నం కు తెలిసిపోతుంది. రాత్రి 8 గంటల నుంచి పది గంటల మధ్యకాలంలో అధికారికంగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
మొత్తం మీద జూన్ 4 కోసం అంతా ఎదురుచూస్తున్నారని అనుకోవాలి.