ముందు చూపుతో ఆలోచించి తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే కనీసం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అయినా బతికించుకో వచ్చు.
రాబోయే 10 సం.లలో ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ వినియోగం బాగా తగ్గిపోతుంది. కార్లు బస్సులు. మొదలగునవి. పూర్తిగా బ్యాటరీ మీద ఆధార పడేవే వస్తాయి. అప్పుడు మన HPCL, BPCL, IOC వంటి కంపెనీలు కోనే వారు ఉండరు. ఆ కంపెనీలు ఇప్పుడే తెలివి తెచ్చుకొని ప్రత్యమ్నాయ ఉత్పత్తి మార్గాలు ఇప్పటి నుండి వెతుక్కోలేక పోతే వాటికి భవిష్యత్ ఉండదు. అందుకే వాటిలో కొంత మేర వాటాలు అమ్మి ఆ డబ్బులు ఆ కంపెనీల భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు మీద ఖర్చు చెయ్యాలి. ఫ్యాక్టరీ మా తాత పెట్టాడు, మా నాన్న పెట్టాడు అందుకే అమ్మను అనే సెంటిమెంట్స్ వ్యాపారంలో పనిచేయవు.
ప్రస్తుతం ప్రపంచంలో రెండు తరహా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అన్నిటిని కలిపి వీటిని ‘ప్లెగ్ ఇన్ ఎలక్ట్రిక్’ అంటే PEV లుగా పిలుస్తారు. దీనిలో మొదటి రకం పూర్తిగా బ్యాటరీ తో నడిచేవి, వీటిని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా BEV లుగా, రెండో రకం హైబ్రిడ్ వెరైటీ ఇవి కొంత ఎలెక్ట్రిసిటీ. కొంత సంప్రదాయ ఇంధనం ఉపయోగిస్తాయి. వీటిని ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ గా అనగా PHEV లుగా పిలుస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ నిల్వలు తగ్గిపోతూ ఉండడం, కాలుష్యాన్ని కూడా దృస్తిలో ఉంచుకొని వివిధ దేశాలు సబ్సిడీలు వంటివి అందిస్తూ ఈ బ్యాటరీ కార్ల వినియోగం పెంచడానికి కృషిచేస్తున్నారు.
కానీ ఇవి ఖరీదు ఎక్కువగా ఉండడం, బ్యాటరీ శక్తి ఎక్కువ సేపు నిల్వ ఉంచలేకపోవడం, ఎక్కువ పవర్ ఇవ్వలేకపోతూ ఉండడం, ఛార్జింగ్ పాయింట్ స్టేషన్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో అనుకున్నంత వేగంగా ఇవి మార్కెట్ లోకి చొచ్చుకు పోలేకపోతున్నాయి.
విదేశాల్లోనే ఇప్పటికి ప్రతీ వెయ్యి మందిలో స్వీడన్ లో ఎక్కువగా అంటే 90 మంది, కాలిఫోర్నియా, స్వీడన్ లో సుమారు 20, జర్మనీ మిగతా యూరోప్ చైనా ఇలా మిగతా దేశాల్లో 8 నుండి 4 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రపంచం మొత్తము మీద గత సం.సుమారు కోటి వాహనాలు తయారు చేస్తే వాటిలో సింహ భాగం చైనా చేసింది. అంటే 46 లక్షల కార్లు, 5 లక్షల లారీలు సుమారు 3 లక్షల చిన్న వాహనాలు చేసింది..
భారత్ కూడా ఈ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టి మోడీ ప్రభుత్వం వచ్చాక ఇవి.కొనే వారికి పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దీనితో 2015లో 6500 కార్లతో మొదలు అయి ప్రతీ సం. పెరుగుతూ వస్తున్నాయి. మన పాపులర్ కార్ల కంపెనీలు అయిన టాటా మోటార్స్ నెక్సన్ మోడల్ దింపింది. ఇది 14 లక్షల నుండి 16 లక్షలు ధర ఉంది. ఒక సారి ఛార్జ్ చేస్తే 300కి.మీ వస్తుంది, ఒక గంట ఛార్జ్ చేస్తే బ్యాటరీ 80% రీఛార్జ్ అవుతుంది. అలాగే టాటా టైయగో 10 లక్షలకు, మహీంద్రా వేరిటో కూడా 10 లక్షల రేంజ్ లో మోడల్స్ దింపాయి. ఇవికాక హ్యుందాయ్, మెర్సిడర్స్, MG కూడా తయారు చేస్తున్నాయి.
ప్రపంచంలో బ్యాటరీ కారు దిగ్గజం టెస్లా బెంగుళూరులో ప్లాంట్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ లిథియం బ్యాటరీలు తయారుచేయడానికి కావలసిన ముడిపదార్ధం కర్ణాటక లోఇటీవలే కనుక్కున్నారు. తోషిబా కంపనితో ఒక భారత్ కంపనీ టై అప్ పెట్టుకొని గుజరాత్ లో లిథియం బ్యాటరీలు తయారుచేస్తున్నారు.
కేంద్రం తన వంతుగా ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఒక ఇజ్రెయేల్ కంపనితో టై అప్ పెట్టుకొని అల్యూమినియం ఆధారిత బ్యాటరీలు తయారుచేయడానికి ఒప్పొండం కుదుర్చుకుంది. అలాగే IOC చేత పెట్రోల్ లో కలిపే విధంగా వుండే మెథనల్, ఇథనల్ ఉత్పత్తి కూడా తయారుచేయించడానికి ఆంధ్రా లో 600 కోట్లతో, తెలంగాణలో 600.కోట్లతో ప్లాంట్స్ నెలకొల్పడానికి సన్నాహాలు మొదలు అయ్యాయి.
అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చవగ్గా ఉండడానికి , నగరాల్లో డీజిల్ కాలుష్యం తగించడానికి పెద్ద పెద్ద నగరాలలో డీజిల్ సిటీ బస్ ల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ అహమ్మదాబాద్ వంటి పెద్ద నగరాల్లో రోడ్లపై నడుస్తున్నాయి. 15000 ఎలెక్ట్రిక్ బస్సులు కావాలి అని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే హిమాలయ మార్గాల్లో అంటే సిమ్లా-కులు-మనాలి రూట్లో కాలుష్యం తగ్గించడానికి 25 సీటర్ల మినీ బ్యాటరీ బస్సుల వాడుక మొదలు అయింది.
అలాగే టాటా పవర్ కంపనీ దేశంలోఇప్పటికే 40 ముఖ్యనగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పింది. ఇవి దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోంది.
పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం సమస్యకు తాత్కాలిక పరిష్కారం. పైన చెప్పుకున్న వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం శాశ్వత పరిష్కారం.
-చాడాశాస్త్రి