కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 30 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5.34 గంటల వరకు 77.9 శాతం ఓటింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగింది. పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు.. 324 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం మే 2వ తేదీన తేలనుంది.
కాగా, తమిళనాడులో కూడా భారీగానే పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5.34 గంటలకు వరకు 63.47శాతం నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇక కేరళలో అదే సమయానికి 69.95 శాతం, అసోంలో 78.94 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
బెంగాల్లో ముగిసిన మూడో దశ
ఇక వెస్ట్ బెంగాల్లో మంగళవారం నాడు మూడో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5.34 గంటల వరకు 77.68 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరి ఉండటంతో.. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగాల్లో ఇంకా ఐదు దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. వీటన్నింటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనుంది.
https://twitter.com/ANI/status/1379409691210489857