ఉగ్రవాదులను కనిపెట్టి వారిని మట్టుపెట్టడంలో ఆర్మీకి సహకరించిన జాగిలం జూమ్ కన్నుమూసింది. శ్రీనగర్‌లోని ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయింది. దాని ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని…కోలుకోవచ్చని డాక్టర్లు సైతం అంచనా వేశారు. అయితే ఉన్నట్టుండి పరిస్థితి విషమించింది. సోమవారం కశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో జూమ్ కు గాయాలయ్యాయి. దాని వెనక కాలు, మొకానికి బుల్లెట్లు తగిలాయి. వెంటనే ఆస్పత్రికి చేర్చి దానికి ఆపరేషన్ చేశారు.
అనంతనాగ్ జిల్లా తంగపావా ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని జూమ్ గుర్తించింది. వారిపై దాడికి దిగింది. ఆ క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో రెండు తూటాలు దాని శరీరంలోకి వెళ్లాయి. గాయాలతోనే, రక్తమోడుతూ కూడా వారిని వదల్లేదు. ఆలోగా భద్రతా దళాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టారు. గతంలో పలు కీలక ఆపరేషన్లలోనూ జూమ్ పాల్గొంది. శ్రీనగర్ ఆర్మీ డాగ్ యూనిట్లో 8 నెలలుగా సేవలందిస్తోంది జూమ్.
#WATCH | Army officers lay wreath on mortal remains of Army Assault Canine 'Zoom'
Zoom passed away at 54 AFVH (Advance Field Veterinary Hospital) where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct.
(Source: Chinar Corps) pic.twitter.com/j9mgzpglDV
— ANI (@ANI) October 14, 2022