ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద హత్యయత్నం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. కత్తితో అనేకసార్లు పొడుచినందున సైఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మొదట్లో దొంగతనం కారణం అని అనుమానించినప్పటికీ,, తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
సైఫ్ ఇంటిదగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకూ సైఫ్ నివాసముంటున్న అపార్ట్మెంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని తేలింది. సీసీటీవీ ఫుటేజ దీంతో ఇంట్లో ఉన్న వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక డక్ట్ ఉందని, అది అతని బెడ్ రూమ్‌లో తెరుచు కుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడు అక్కడి నుంచే అతని ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్‌తోపాటు అతని నివాసంలోని మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది.
మరోవైపు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాయంత్రం దాటాక ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.