బెయిల్ మీద బయటకు వచ్చాడో లేదో మళ్లీ అరెస్టయ్యారు గుజరాత్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. అసోం పోలీసులు మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో బెయిల్ పొందిన కాసేపటికే కొత్త కేసులో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అసోంలోని బార్పెటా పోలీసులు మేవానీని అరెస్ట్ చేశారు. గత వారం గుజరాత్‌లోని పాలంపూర్ ప్రాంతంలో జిగ్నేష్ మేవానీని అసోంకు చెందిన పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ప్రధాని మోడీని వ్యతిరేకిస్తూ జిగ్నేష్ మేవానీ చేసిన రెండు ట్వీట్లే ఇందుకు కారణమయ్యాయి. ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ అసోంకు చెందిన ఓ వ్యక్తి స్థానిక కోక్రఝర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరపూరిత కుట్ర, మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడంతోపాటు ఇతర అంశాలను పేర్కొన్న పోలీసులు విచారణ నిమిత్తం మేవానీని అరెస్ట్ చేశారు. తాజాగా ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది తెలియలేదు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)