ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా అంతకంతకు పెరుగుతోంది. బంగ్లాదేశ్ మియన్మార్ లో నుంచి అక్రమ వలసలు ఆగటం లేదు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా ముఖ్యంగా ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతుంది. అసోం ముఖ్యమంత్రి హేమంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో జనాభా నిష్పత్తి మారిపోతున్నఅంశం నాకో సమస్యగా తయారయింది. నేడు అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం. 1951లో 12 శాతం మాత్రమే ఉండేది. మనం చాలా జిల్లాలను పోగొట్టుకున్నాం. ఇది రాజకీయ అంశం కాదు. ఇది చావో రేవో వంటి సమస్య’’అని ఆయన చెప్పారు.

కాగా, జూలై 1న, శర్మ ఏ మతం గురించి ప్రస్తావించకుండానే ఓ ‘ప్రత్యేక మతం’ చెందిన ఒక వర్గం నేరపూరిత కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. “ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే నేరాలకు పాల్పడతారని నేను చెప్పడం లేదు. కానీ ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల నుండి ఇటీవలి సంఘటనలు ఆందోళన కలిగించే విషయం” అని శర్మ పేర్కొన్నారు.
జూన్ 23న, బంగ్లాదేశ్ మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశారని, రాష్ట్రంలో, కేంద్రం లోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకోలేదని శర్మ విచారం వ్యక్తం చేశారు. అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలున్న మైనారిటీ కమ్యూనిటీ మాత్రమే మతతత్వానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
ఈ జనాభా అంశము ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో, అస్సాంలోని 14 లోక్సభ స్థానాలకు గాను బిజెపి-ఎజిపి-యుపిపిఎల్ సంకీర్ణం 11 స్థానాలను గెలుచుకోగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 24 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్నాయి.
ఓటు బ్యాంకు విషయాలు పక్కన పెట్టినట్లయితే పక్క దేశాల కారణంగా మైనార్టీల జనాభా పెరిగిపోవడం దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉంది.