అసోం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో వరదల కారణంగా 6.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. బరాక్ లోయ, దిమా హసావో సహా హొజాయ్ ప్రాంతాలు ఎక్కువగా విపత్తుకు గురయ్యాయి. నీటి ఎద్దడి కారణంగా అనేక చోట్ల రోడ్లు, రైళ్ల వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది, మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. బరాక్ లోయ, దిమా హసావో, హోజాయ్ ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ పనులను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సీనియర్ మంత్రులను నియమించింది. కాచర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నేటి నుంచి 48 గంటల పాటు మూసివేయనున్నారు.
రాష్ట్రంలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహార పదార్థాల కొరత లేదని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారు. దిమా హసావో జిల్లాలో IAF ఆహార పదార్థాలను హెలికాఫ్టర్ల ద్వారా అందించిందని హిమంత చెప్పారు.