ఆశ్రమంలోని ఓ మహిళపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపూపై గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తనను నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచారం చేసినట్టు సూరత్‌కు చెందిన ఆయన శిష్యురాలే ఆరోపించింది. దీనిపై 2013లో ఆయనతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు తగిన ఆధారాలు లేకపోవడంతో ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు.