మదర్సాలపై అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హిమంతపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.
ఆర్ఎస్ఎస్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నింపడంలేదని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవంతో బతకడం అక్కడ నేర్పిస్తున్నారనీ అన్నారు. అసలు స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు బ్రిటిషర్లతో పోరాటం చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్లకు ఏజెంట్లుగా వ్యవహరించిందని విమర్శించారు.
పాఠశాలలు పెట్టి ఖురాన్ బోధించాల్సిన అవసరం లేదని, ఖురాన్ చెప్పాలంటే ఇంట్లో చెప్పుకోవాలని… మీ పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు కావాలంటే సైన్స్, మాథ్స్, బయాలజీ చదవాలనీ హిమంత అంటూ…అసలు మదర్సాలే అక్కర్లేదు అని అన్నారు. దానికి ట్విట్టర్ వేదిగ్గా ఘాటుగా స్పందించారు అసద్య ‘‘మదర్సాల్లో సైన్స్, మాథ్స్, సోషల్ అన్నీ చెప్తారు. శాఖల్లాగ కాదు, మదర్సాలో ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, సానుభూతి నేర్పిస్తారు. చదువులేని సంఘీలకు ఇది అర్థం కాదు. హిందూ సంఘసంస్కర్త రాజా రాం మోహన్ రాయ్ చదువుకున్నది మదర్సాలోనే. ఆయన అక్కడ ఎందుకు చదువు చదువుకున్నారో వాళ్లకి అర్థం కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం ముస్లింలు పోరాడుతుంటూ సంఘీలు బ్రిటిషు ఏజెంట్లలా వ్యవహరించారు. ముస్లింలు భారతదేశాన్ని సుసంపన్నం చేశారు. అది కొనసాగుతుంది కూడా’’ అని అన్నారు.