డ్రగ్స్ కేసులో అరెస్టై ..ఇవాళే బెయిల్ పొందిన ఆర్యన్ తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల సందర్భంగా పలు అంశాల్ని కోర్టుముందుంచింది.ఐదేళ్లుగా అతను డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఎన్సీబీ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టుకు తెలిపారు. అతనితో పాటు అరెస్టైన మిగతావాళ్లూ బల్క్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తారని, డ్రగ్స్ సరఫరాచేసేవారితో సన్నిహితసంబంధాలు వారికున్నాయని తెలిపారు.