డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ పిటిషన్ ను మళ్లీ తిరస్కరించింది సుప్రీంకోర్టు. ముంబైకి చెందిన ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చెంట్, మున్ మున్ దంచాలు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో వారు ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. ఆర్యన్ క్రూయిజ్ షిప్లో స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చి ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. లోపల డ్రగ్స్ ఉండడంతో అందులో ఉన్నవారిని అరెస్ట్ చేశారు.అయితే ఆర్యన్ దగ్గర డ్రగ్సే లేవని అతని తరపు లాయర్లు వాదించారు. ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు బయటపెట్టడంతో మూడోసారి అతనికి బెయిల్ దొరకలేదు.