టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు ఎంపీ అర్వింద్.
కమీషన్లకే పనిచేయడం కేసీఆర్కు అలవాటైపోయిందన ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని మండిపడ్డారు. రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడుకుని, కుమార్తెను తాము పట్టించుకోబోమన్నారు. బీజేపీ వారు జోకర్లు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బీజేపీని జోకర్లు అని విమర్శించేముందు ఆయన తండ్రి ఒక బ్రోకర్ అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సానుభూతిపరులు అరెస్ట్ అవుతున్నారని ప్రశ్నించగా… దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని అర్వింద్ బదులిచ్చారు. అటు పీఎఫ్ఐకి ఇటు ఎంఐఎంకు మధ్య కేసీఆర్ బ్రోకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫీనిక్స్ తదితర సంస్థలపై జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాల మేరకు కేటీఆర్ కూడా జైలుకు వెళతాడని అన్నారు. వాళ్ల కోసం జైళ్లు సిద్ధం చేసి పెట్టాలని జైళ్ల శాఖ మంత్రికి సూచించారు.