భరూచ్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుల కోసం జిల్లా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందారు పోలీసులు. అబ్దుల్ సమద్ మహ్మద్ అలియాస్ దావూద్ సులేమాన్ పటేల్ (బేకరీవాలా), షబ్బీర్ మహ్మద్ పటేల్ (బేకరీవాలా), హసన్ ఇషా పటేల్ (హసన్ తిత్లీ), ఇస్మాయిల్ యాకూబ్ అలియాస్ ఇస్మాయిల్ అచ్చోద్వాలా (మౌల్వీ)పై సీఆర్పీసీ సెక్షన్ 70 కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అలాగే ప్రస్తుతం యూకేలో ఉంటున్న కీలక సూత్రధారి అబ్దుల్లా ఆడమ్ ఫెఫ్దావాలా కు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇవాళో రేపో పోలీసులు వీళ్లకు సమన్లు జారీ చేయవచ్చు. అలాగే చట్టప్రకారం వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 37 గిరిజన కుటుంబాలకు డబ్బు ఎరచూపి ఇస్లాంలోకి మార్చినట్టు వీళ్లపై ఆరోపణలున్నాయి. ప్రవీణ్ వాసవా అనే వ్యక్తి ఫిర్యాదుతో తొమ్మిది మందిపై భరూచ్ లోని ఆమోద్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 15న కేసు నమోదైంది. అప్పుడే ఆరుగురిని అరెస్ట్ చేయగా భరూచ్ కు చెందిన నలుగుర్ని అరెస్ట్ చేయలేదు. ఐదో నిందితుడు అబ్దుల్లా ఫెఫ్దావాలాప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ ఆయిన నేపథ్యంలో త్వరలోనే వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
CrPC సెక్షన్ 70 కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత….నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా , రాష్ట్రం వెలుపల ఆయా రాష్ట్రాల సాయం తీసుకోవచ్చు. వారి ఆచూకీ తెలపాలంటూ పత్రికల్లో నోటీసులూ ఇవ్వవచ్చు. అరెస్ట్ వారెంట్ జారీ తరువాత నిందుతుల్ని అరెస్ట్ చేయలేకపోతే… CrPC సెక్షన్ 82 ప్రకారం వారు పరారీలో ఉన్నారని ప్రకటించి వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.
15 నవంబర్ 2021న, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 120 (బి), 153 (బి) (సి), 506తో పాటు సెక్షన్ 4, 5, 4-జి కింద గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం కింద అమోద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితులు హిందూ మతానికి చెందిన గిరిజనులకు ఉద్యోగం ఇప్పిస్తామని అవసరాలకు డబ్బు ఇస్తామని మాట ఇచ్చి 2018లో ఇస్లాం మతంలోకి మార్చారు. అలాగే దేశవ్యాప్తంగా మతమార్పిడి రాకెట్ పనిచేస్తోందని ఫిర్యాదుదారు ఆరోపించారు. మతమార్పిళ్ల గురించి ప్రశ్నించినందుకు కశ్మీర్, పాకిస్తాన్ లోని సంస్థలతో తమకు సంబంధాలున్నాయని బెదిరించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఫిర్యాదుదారు.
దర్యాప్తులో భాగంగా… ఎఫ్ఐఆర్లో పేర్కొన్న తొమ్మిది మందిలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు విదేశాల నుంచి 14 లక్షల విరాళం తీసుకున్నట్టు తేలింది. . ఇందులో బహ్రెయిన్‌లోని ఇస్మాయిల్ నుంచి రిజ్వాన్ పటేల్ రూ.7 లక్షలు వసూలు చేశాడు. రిజ్వాన్ పటేల్ మసీదు నిర్మాణం కోసం, అలాగే…ఇస్లాంలోకి మారే వాళ్లకి ఇచ్చేందుకని సేకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
గిరిజనుల్ని ఇస్లాంలోకి మార్చేందుకు స్థానికుడైన గిరిధర్ భాయ్ వాసవా ముఖ్యపాత్ర పోషించినట్టు తేలింది. జంబూసర్లోని అబ్దుల్ బషీర్ పటేల్ గ్రామంలో….కొత్తగా మతం మారిన వారికోసం ఓ ప్రార్థనాలయాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఇస్లాం బోధించేందుకు ఓ వ్యక్తిని నియమించారు.
అచ్చోడ్ కు చెందిన బైతుల్మాల్ ట్రస్ట్ నుంచి సాజిద్ ,యూసుఫ్ , సలావుద్దీన్ షేక్ వారికి 3లక్షల 71 వేల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబరులో, వడోదర నగర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ….నగరానికి చెందిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లింస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AFMI) బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాల కోసం 400 ప్లాట్ల నిర్మాణానికి, అలాగేఇతర కార్యకలాపాలకోసం హవాలా నిధులు తరలిస్తున్నట్టు కనుగొంది. ఘజియాబాద్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తోంది. ఇక ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలో మౌల్వీలకూ పెద్దఎత్తు నిధులు సమకూర్చినట్టు వార్తలు వచ్చాయి. AFMI యొక్క ట్రస్టీలలో షేక్ ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ప్రభావంతో షేక్ ఈ ట్రస్ట్ ప్రారంభించాడు. సామూహికమత మార్పిడి రాకెట్లో ఇతని పేరు కూడా ఉంది.
ప్రస్తుతం UKలోని లండన్‌లో ఉన్నట్లు భావిస్తున్న నిందితుల్లో ఒకరైన హాజీ ఫెఫ్దావాలా 2019లో వడోదరలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్టు పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి. 2002లో గోద్రాలో రైలు దగ్ధం అనంతరం అల్లర్లు ప్రేరేపించేలా చేసిన ప్రసంగాలున్నాయి. నాడు అయోధ్యనుంచి తిరిగి వస్తున్న కరసేవకులున్న భోగీని తగులబెట్టివారిని సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే.
2003లో తాను UKలో ట్రస్ట్‌ని స్థాపించానని, అక్కడ 125 మంది దాతలను సంప్రదించి భారత్‌కు విరాళాలు పంపుతున్నానని చెప్పుకొచ్చాడు. తన కమ్యూనిటీ బలోపేతానికే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నానన్నాడు. ‘ఇతర మతాల దాడుల నుంచి తనను తాను రక్షించుకోగలం ‘ అని పలు వేదికలనుంచి ఫెఫ్దావాలా చెప్పారు. ముఖ్యంగా గుజరాత్ లో ‘ తన సమాజాన్ని బలోపేతం చేయడం’ అనే అంశం గురించే గంటపాటు ప్రసంగించాడు.