మోదీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల.
మొన్నటిది తుది తీర్పు కాదు. తాము నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు మోడీ
ప్రధాని కాక ముందే 2013 లోనే పూర్తి క్లీన్ చిట్ ఇచ్చింది.
సిట్ ఇచ్చిన ఆ క్లీన్ చిట్ పై 5 సం. లు తరువాత 2018 లో మళ్ళీ జకీయా జాఫ్రీ అనే ఆమె వేసిన పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ సిట్ పనితనాన్ని, నివేదికను మరొక సారి మెచ్చుకుంటూ ఈ అల్లర్లలో మోడీ పేరు ఎలాగైనా ఇరికించాలి అని కుట్ర చేసిన వారి అందరి పేర్లు, వారి చేతలు అన్ని సుప్రీంకోర్టు తన 452 పేజీల తీర్పులో వివరంగా పేర్కొంది.
ఈ జకీయా జాఫ్రీ అనే ఆమె 2002 అల్లర్లలో తన భర్త పోయాడని అప్పటికి అధికారంలో ఉన్న వారి అలసత్వం వల్లే పోయాడు అని సంఘటన జరిగిన 4 సం. లు తరువాత 2006 లో మొదటి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేయించడం వెనకాల తీస్తా తెసేల్వాద్ అనే జర్నలిస్ట్ మరియు మానవ హక్కుల కార్యకర్త ఉంది అని అప్పుడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. “ఈ తీస్తా అనే ఆమె పూర్వాపరాలు చూస్తే తన స్వార్ధ ప్రయోజనాల కోసం దురుద్దేశంతో జకీయా అనే ఆమె ఉద్వేగాలను వాడుకుంటూ ఒక కక్షపూరిత ధ్యేయంతో ఈ కేసును నడిపించింది అని సిట్ సేకరించిన ఆధారాలు వల్ల తెలుస్తోంది” అని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.
“సాక్ష్యాలను తయారు చేయడం, ఒకే రకంగా ఉన్న సాక్షుల స్టేట్మెంట్స్ తయారుచేయడం, సాక్షులను ఆమె చెప్పినట్లే సాక్ష్యం చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం మొదలగు ఈమెపై గల ఆరోపణలను సిట్ ధృవీకరించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.”
“ఈ తీస్తా తెసేల్వాద్ తన స్వంత ప్రయోజనాలు కోసం జకీయా జాఫ్రీ ఉద్వేగాలను ఉపయోగించు కుంది కాబట్టి ఈమె మీద ఇంకా విచారణ కొనసాగాలి” అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.
అప్పుడూ ఇప్పుడూ కూడా ఉదార వాదుల ముద్దుగుమ్మ అయిన ఈ తీస్తా తెసేల్వాద్ అనే ఆమె ఒక జర్నలిస్ట్. 2002 గుజరాత్ సంఘటనలను ఊత కర్రగా ఉపయోగించుకుని బాగా డబ్బు ,పేరు, పరపతి సంపాదించిన కొందరిలో ఈమె ఒక ప్రముఖురాలు. ఈమె గుజరాత్ అల్లర్లలో నష్టపోయిన వారికి సహాయం చేయడం కోసం అని “సర్బంగ్” అనే NGO ప్రారంభించి నిధులు వసూలు చేసింది. అయితే ఆమె వసూలు చేసిన డబ్బులు తమకు చేరలేదని బాధితులు ఆరోపించారు. ఆంతే కాక రాయీస్ ఖాన్ అనే ఆమె సహచరుడు ఈమె విద్యావ్యాప్తి కోసం అని కేంద్ర ప్రభుత్వం నుండి ₹1.41కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగం చేసింది అని ఆరోపించాడు. (అంటే కపిల్ సిబల్ HRD మంత్రిగా ఉండగా ఈ తీస్తాకు ప్రజల సొమ్ము ₹1.41కోట్లు మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇచ్చాడు అని అనుకోవాలా?) అంతే కాక సర్బాంగ్ కమ్యూనికేషన్ అండ్ పై.లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించి ఫోర్డ్ ఫౌండేషన్ నుండి $2.90లక్షల డాలర్లు విరాళం గా తీసుకుంది. ఈ సంస్థ FCRA రిజిస్ట్రేషన్ చేయంయించలేదు. పైన UPA ప్రభుత్వం లో వడ్డించేవాళ్ళు వాళ్ళ వాళ్లే కావడంతో ఈ తీస్తా కు అడ్డు లేకుండా పోయింది. అన్ని ఫిర్యాదులు పై కేసులు బుక్ అయ్యాక సిబిఐ 2015లో ఆమె ఇంట్లో దాడులు చేస్తే బాధితులు కోసం వసూలు చేసిన విరాళాలతో వైన్, లిక్కర్, ఖరీదైన మొబైల్స్, సినిమా సీడీలు, ఖరీదైన నావల్స్, సానిటరీ నాప్కిన్స్ ఇలా అన్ని పెర్సనల్ ఖర్చులకు ఈ విరాళాలు వాడేసినట్లు లెక్కల పత్రాలు దొరికాయి. ఈ తీస్తా మీద ఈ ఆరోపణలు మాత్రమే కాదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా 28 సమాధులు తవ్వి దానిలో దొరికిన అవశేషాలు గుజరాత్ అల్లర్లలో పోయిన బాధితులవి అని ఆరోపణలు చేసింది. దీని మీద కూడా సుప్రీంకోర్టు లో కేసు నడుస్తోంది.
ఆ రోజుల్లో ఈ తీస్తా ప్రతీ పాపులర్ టివి ఛానల్ లో ప్రైమ్ టైం డిబేట్స్ లో పాల్గొంటూ మోడీ మీద నోటికి వచ్చిన ఆరోపణలు చేసేది. ఆమె అప్పట్లో ఒక సెలెబ్రెటీ. ఈ అవినీతి ఆరోపణలు మీద గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయబోతే ఆమె గుజరాత్ హై కోర్ట్ కి ఆంటీసీపీటరీ బెయిల్ కోసం పోతే వాళ్ళు తిరస్కరిస్తే కపిల్ సిబల్ చేత హై కోర్ట్ తిరస్కరించిన గంటల్లో సుప్రీంకోర్టు లో ఆంటీసీపీటరీ బెయిల్ తెచ్చుకున్నంత పవర్ ఫుల్ ఆమె.. ఆ తరువాత రోజుల్లో సుప్రీంకోర్టు తాము అలా బెయిల్ ఇచ్చిన విధానం తప్పు అని విచారం వ్యక్తం చేసింది.
ఈ తీస్తాకు అప్పట్లో బోల్డ్ అవార్డ్స్ రివార్డ్స్ దక్కాయి.
2007 ఏకంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా
“పద్మశ్రీ” అవార్డ్ అందుకుంది సోనియా యే స్వయంగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇంత దారిద్ర్య గొట్టు వాళ్లకు కూడా పద్మ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని తమకు అనుకూలంగా వాడుకునేది.
ముఖ్యంగా అప్పటి అధికారులు అయిన సంజీవ్ భట్, పి.బి. శ్రీకుమార్ మీద కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
అప్పటి కేసుకు ముఖ్య సాక్ష్యంగా ఈ సంజీవ్ భట్ అనే పోలీస్ అధికారి తాను గొడవలు జరిగిన రోజు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మీటింగ్ ఉన్నట్లు ఆ రోజు ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని పోలీసులని ఆదేశించాడు అని స్టేట్మెంటు ఇచ్చాడు. అయితే అతను ఆ మీటింగ్ లో లేడు అని సిట్ అన్ని ఆధారాలతో నిరూపించడం తో కేస్ బలహీనపడింది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సంజీవ్ భట్ ఒక డ్రగ్ కేస్ లో ఇప్పటికే జైల్లో ఉన్నాడు. గుజరాత్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంజీవ్ భట్ భార్య కాంగ్రెస్ టికెట్ మీద మణినగర్ స్థానంలో ముఖ్యమంత్రి మోడీ పై పోటీ చేసింది.
ఇంకో అధికారి పిబి శ్రీకుమార్ చర్యలు పైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే శ్రీ కుమార్ కేరళలో డీజీపీ గా పనిచేస్తున్నప్పుడు సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త నంబినారాయణ్ ని ఇస్రో గూఢచర్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టాడు.
ఇప్పుడు వీళ్ళ పాపం పండింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నిన్న గుజరాత్ ATS పోలీసులు ఈ తీస్తాని, శ్రీ కుమార్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
నా ఉద్దేశ్యం ప్రకారం ఈ కేసులో మరో ముఖ్య వ్యక్తి
రాణా ఆయూబ్ ని కూడా అరెస్ట్ చేస్తే ఇంకొన్ని నిజాలు బయట పడతాయి.
~ చాడా శాస్త్రి